అఫ్రిది కొత్త నిర్ణయం.. అదే జరిగితే బాబర్, రిజ్వాన్‌ల గతేం గాను..? సోషల్ మీడియాలో ట్రోల్స్ జాతర

Published : Jan 03, 2023, 04:36 PM IST
అఫ్రిది కొత్త నిర్ణయం..  అదే జరిగితే బాబర్, రిజ్వాన్‌ల గతేం గాను..? సోషల్ మీడియాలో ట్రోల్స్ జాతర

సారాంశం

పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఇటీవల ప్రక్షాళన   చేపట్టిన ప్రభుత్వం  ఆ జట్టు మాజీ సారథి షాహిద్ అఫ్రిదిని చీఫ్ సెలక్టర్ గా నియమించింది.  అయితే  రావడం రావడే అఫ్రిది   పాక్ టీమ్ కు భారీ షాకిచ్చాడు.

ఇటీవలే పాక్ క్రికెట్ లో చీఫ్ సెలక్టర్ గా నియమితుడైన మాజీ సారథి షాహిద్ అఫ్రిది  రావడం రావడమే బాంబు పేల్చాడు.  టీ20లలో జట్టులోకి రావాలంటే కొత్త నిబంధన తీసుకొచ్చాడు.   అది తన ప్రతిపాదన అని.. దానిని  ఇతర సభ్యులు, బోర్డుతో  చర్చించి  అమలుపరచాలని  అఫ్రిది కంకణం కట్టుకున్నాడు.  ఒకవేళ  అఫ్రిది గనక తన నిర్ణయాన్ని అమలుపరుచాలనుకుంటే ప్రస్తుతం పాకిస్తాన్  బ్యాటింగ్ కు వెన్నెముకగా ఉన్న  కెప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ల పని గోవిందా.. గోవిందా.. అంటున్నారు అభిమానులు. 

ఇంతకూ అఫ్రిది తీసుకొచ్చే నిబంధన ఏంటంటే..  టీ20లలో పాకిస్తాన్ తరఫున  ఆడాలనుకుంటే  సదరు క్రికెటర్లు   దేశవాళీ క్రికెట్ లో వారి సగటు  కనీసం  135గా ఉండాలని  నిబంధన తీసుకురావాలనుకుంటున్నాడు.  

గత రెండేండ్ల కాలంగా  టెస్టులు, వన్డేలలో గొప్ప ప్రదర్శనలు చేయకపోయినా టీ20లలో  పాకిస్తాన్ ఫర్వాలేదనిపిస్తున్నది.  బ్యాటింగ్ లో  సారథి బాబర్ ఆజమ్ తో పాటు ఓపెనర్  మహ్మద్ రిజ్వాన్ లు  రికార్డు భాగస్వామ్యాలతో ఒంటిచేత్తో జట్టును నడిపిస్తున్నారు. అయితే  నిలకడగా రాణిస్తున్నా ఈ ఇద్దరి స్ట్రైక్ రేట్ మాత్రం  దారుణంగా ఉంది. బంతికి ఓ పరుగు చొప్పున ఆడుతూ టీ20లను కూడా టెస్టులలాగా ఆడతారని ఈ ఇద్దరికీ   పేరుంది.  ఒకవేళ అఫ్రిది  తన నిబంధనను అమలుపరచాలనుకుంటే  జాతీయ జట్టులో మొదట  స్థానం కోల్పోయేది ఈ ఇద్దరే. 

టీ20లలో బాబర్ స్ట్రైక్ రేట్  127.5 కాగా రిజ్వాన్ 126.6 తో ఇద్దరూ ఒకే విధంగా ఉన్నారు.  జట్టులోకి రావాలంటే అఫ్రిది   130-135 స్ట్రైక్ రేట్ కావాలంటున్నాడు. ఈ నేపథ్యంలో బాబర్, రిజ్వాన్ ను జట్టు నుంచి తప్పించడం ఖాయమే అని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.   ఈ ఇద్దరినీ టీ20ల నుంచి తప్పించాలని గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ లో తీవ్ర చర్చ  సాగుతున్నది. తాజాగా అఫ్రిది  వ్యాఖ్యలు కూడా అందుకు ఆజ్యం పోశాయి.  

 

ఇక అఫ్రిది కామెంట్లు,  బాబర్ - రిజ్వాన్ ల స్ట్రైక్ రేట్ లతో సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు ఫుల్ మీల్స్ దొరికినట్టైంది. ఈ ఇద్దరీ స్ట్రైక్ రేట్ కు సంబంధించిన గణాంకాలతో  అఫ్రిది వ్యాఖ్యలను జతచేసి వాళ్లు పండుగ చేసుకుంటున్నారు. ఈ ట్రోల్స్ నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. 

 

 


 

PREV
click me!

Recommended Stories

Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !
Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు