Under 19 World Cup final: భారత్-ఆస్ట్రేలియాల మధ్య అండర్-19 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ బెనోని వేదికగా జరుగుతోంది. ఇప్పటివరకు భారత్ 5 సార్లు అండర్19 ప్రపంచ కప్ గెలుచుకోగా, ఆస్ట్రేలియా మూడు సార్లు టైటిల్ సాధించింది.
Australia-India final - India vs Australia : అండర్ 19 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. బెనోనిలో జరగబోయే ఈ మ్యాచ్ లో గెలిచి చరిత్ర సృష్టించాలనుకుంటోది యువ భారత్. ఇప్పటివరకు జరిగిన అండర్-19 వరల్డ్ కప్ చరిత్రను గమనిస్తే భారత్ తిరుగులేని రికార్డును కలిగివుంది. మరోసారి ఛాంపియన్ గా నిలవాలని చూస్తోంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలిచి రికార్డు సృష్టించాలని ఆ యువ జట్టు ఉవ్విళ్లూరుతోంది.
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్ మరో కిరీటం వేటలో పడింది. గతేడాది నవంబర్ 19న రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్లో పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య అండర్ 19 ప్రపంచ కప్ 2024 ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలని యంగ్ ఇండియా భావిస్తోంది. సీనియర్ల పరాభవానికి ఉదయ్ సహారన్ నేతృత్వంలోని జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
undefined
అయితే, "మేం ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచించడం లేదు. మన దృష్టి వర్తమానం మీద మాత్రమే. గతం గురించి గానీ, భవిష్యత్తు గురించి గానీ ఆందోళన చెందడం లేదని.. తప్పకుండా విజయం సాధిస్తామని" భారత యువ జట్టు కెప్టెన్ ఉదయ్ సహరాన్ స్పష్టం చేశారు. అలాగే, సచిన్ దాస్, ముషీర్ ఖాన్, సూర్యకుమార్ పాండే వంటి ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు. ఇదే సమయంలో ఆస్ట్రేలియా జట్టులో సమర్థవంతమైన బౌలర్లు ఉన్నారు. సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసిన టామ్ స్ట్రాకర్, కల్లమ్ విడ్లర్ భారత బ్యాటింగ్ లైనప్‌కు సవాల్ విసిరారు.
అండర్ 19 ప్రపంచ కప్ లో మనదే పైచేయి.. !
ఆస్ట్రేలియా జట్టులో తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్లు ఉన్నారు. కాబట్టి భారత బౌలర్లు నమన్ తివారీ, రాజ్ లంబానీలపై ఒత్తిడి ఉండే అవకాశముంది. 2012, 2018 టోర్నీల ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. 2016 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ ఫైనల్ చేరిన ఘనత సాధించింది. 2016, 2020లో మినహా మిగిలిన ఎడిషన్‌లలో విజయం సాధించింది.
ప్రపంచకప్ టోర్నీ భారత్-ఆస్ట్రేలియా..
అండర్19 ప్రపంచ కప్ లో భారత్ తిరుగులేని రికార్డులను కలిగివుంది. ఇప్పటివరకు తొమ్మిదిసార్లు ప్రపంచ కప్ ఫైనల్ కు చేరింది. ఐదు సార్లు టైటిల్ ను సాధించింది. ఇక ఆస్ట్రేలియా మూడు సార్లు అండర్19 వరల్డ్ కప్ ఫైనల్ లో విజయం సాధించింది.
ఇండియా vs ఆస్ట్రేలియా స్క్వాడ్స్:
భారత్:
ఉదయ్ సహారన్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఆరావళి అవ్నీష్ రావు (వికెట్ కీపర్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇనేష్ మహాజన్ (వికెట్) ), ధనుష్. గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ.
ఆస్ట్రేలియా:
హ్యూ వెబ్‌జెన్ (కెప్టెన్), లాచ్‌లాన్ ఐట్‌కెన్, చార్లీ ఆండర్సన్, హర్కీరత్ బజ్వా, మహాలి బార్డ్‌మ్యాన్, టామ్ క్యాంప్‌బెల్, హ్యారీ డిక్సన్, ర్యాన్ హిక్స్ (వికెట్ కీపర్), సామ్ కాన్స్టాస్, రాఫెల్ మెక్‌మిలన్, ఐడాన్ ఓకానర్, హర్జాస్ సింగ్, టామ్ స్ట్రెకర్, కల్లమ్ విడ్లర్, ఒల్లీ పీక్.