IND vs AUS: తొలి టీ20లో టాస్ గెలిచిన ఆసీస్.. బుమ్రా, పంత్ లేకుండానే ఆడుతున్న భారత్

Published : Sep 20, 2022, 06:45 PM IST
IND vs AUS: తొలి టీ20లో టాస్ గెలిచిన ఆసీస్.. బుమ్రా, పంత్ లేకుండానే ఆడుతున్న భారత్

సారాంశం

IND vs AUS T20I: పొట్టి ప్రపంచకప్ కు ముందు ఇండియా-ఆస్ట్రేలియాలు తమ బలాబలాలను మరోసారి పరీక్షించుకోనున్నాయి. ఈ మేరకు తొలి మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

వచ్చే నెలలో  ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే  టీ20 ప్రపంచకప్ కు ముందు సన్నాహకంగా భారత్-ఆసీస్ జట్లు పొట్టి సమరానికి సిద్ధమయ్యాయి. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ కు వచ్చిన ఆస్ట్రేలియా...  మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ కు రానుంది.  టీ20 ప్రపంచకప్ కు ఎంపికై ఈ సిరీస్ ద్వారా ఫిట్నెస్ పరిక్షించుకోవాలని చూస్తున్న  బుమ్రాతో పాటు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. 

ఈ సిరీస్ కు ముందు గాయాలతో  ముగ్గురు కీలక ఆటగాళ్లతో పాటు డేవిడ్ వార్నర్ సేవలను కూడా కోల్పోయిన ఆసీస్..  కొత్త ప్లేయర్లను పరీక్షించడానికి ఇండియా పర్యటనను ఓ అవకాశంగా భావిస్తున్నది. ఈ మ్యాచ్ లో సింగపూర్ చిన్నోడు  టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. 

 

తుది జట్లు : 

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా,  దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ 

ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కెమరూన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హెజిల్వుడ్ 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే