టీ20 వరల్డ్ కప్‌కి ముందు లంకకి ఊహించని షాక్... ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్‌తో టామ్ మూడీ అవుట్...

By Chinthakindhi RamuFirst Published Sep 20, 2022, 11:35 AM IST
Highlights

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ వరకూ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీతో అగ్రిమెంట్... అంత ఇవ్వలేమంటూ కాంట్రాక్ట్‌ని క్లోజ్ చేసిన లంక బోర్డు...

ఆసియా కప్ 2022 ఆరంభం నాటి సంగతి. ఆసియా కప్ 2022 టోర్నీని ఎవరు గెలుస్తారని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఓ పోలింగ్ నిర్వహించింది. ఇందులో శ్రీలంక గెలుస్తుందని ఒక్క శాతం మంది కూడా ఓట్లు వేయలేదు. అయితే రిజల్ట్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా వచ్చింది...

టైటిల్ ఫెవరెట్లుగా బరిలో దిగిన టీమిండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లను చిత్తు చేసిన శ్రీలంక జట్టు...రికార్డు స్థాయిలో ఆరోసారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది. మొదటి మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ చేతుల్లో ఓడిన శ్రీలంక జట్టు, ఆ తర్వాత వరుస విజయాలతో ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది...

ఈ పర్ఫామెన్స్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ శ్రీలంక జట్టుపై అంచనాలు పెరిగాయి. అయితే ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు లంకకు భారీ షాక్ తగిలింది. శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న టామ్ మూడీని ఆ పొజిషన్ నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది ఆ దేశ క్రికెట్ బోర్డు...

శ్రీలంక జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన టామ్ మూడీ, గత ఏడాది ఫ్రిబవరి నుంచి ఆ లంక క్రికెట్ బోర్డుకి డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్‌గా వ్యవహరిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీతో పాటు వన్డే వరల్డ్ కప్ 2023 వరకూ టామ్ మూడీ కాంట్రాక్ట్‌ గడువు ఉంది.

అయితే ఈ మూడేళ్ల కాంట్రాక్ట్‌ను ఇరు వర్గాలు సంయుక్తంగా రద్దు చేసుకున్నట్టు లంక క్రికెట్ బోర్డు సెక్రటరీ మోహన్ డి సిల్వ ప్రకటించాడు. ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మాంద్యం దెబ్బకి జనాలు అతలాకుతలం అవుతున్నారు...

దీంతో టామ్ మూడీతో కుదుర్చుకున్న ఒప్పందంలో రాసుకున్న మొత్తాన్ని అతనికి చెల్లించే పొజిషన్ లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టామ్ మూడీకి రోజుకి 1850 యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు లక్షా 50 వేల రూపాయలు) వేతనంగా చెల్లించాలి. అలాగే లంకలో ఉంటున్నందుకు రోజూ వారీ ఖర్చులు అదనంగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని చెల్లించే పొజిషన్‌లో లేకపోవడంతో టామ్ మూడీని క్రికెట్ డైరెక్టర్ పదవి నుంచి తప్పించింది లంక క్రికెట్ బోర్డు...

టీ20 ర్యాంకింగ్స్‌లో దిగువన ఉన్న కారణంగా వరుసగా రెండో ఎడిషన్‌లోనూ టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయింది శ్రీలంక. గ్రూప్ స్టేజీలో నమీబియా, యూఏఈ, నెదర్లాండ్స్ వంటి జట్లతో ఆడనుంది లంక... 

గత ఏడాది టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీలో విజయాలు అందుకుని, సూపర్ 12 రౌండ్‌లో ఒకే ఒక్క విజయం అందుకోగలిగింది. టామ్ మూడీకి ఈ ఏడాదిలో ఇది వరుసగా రెండో దెబ్బ. ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు హెడ్ కోచ్, క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న టామ్ మూడీని ఆ పొజిషన్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ ... అలాగే యూఏఈ వేదికగా మొదలయ్యే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో డిసర్ట్ వైపర్స్ టీమ్‌కి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరించబోతున్నాడు టామ్ మూడీ... 

click me!