కరోనా ఎఫెక్ట్‌తో మరో క్రికెట్ సిరీస్ గోవిందా

By Siva KodatiFirst Published Aug 5, 2020, 2:25 PM IST
Highlights

కరోనా వైరస్ ధాటికి అన్ని రంగాల్లాగానే క్రీడా రంగం సైతం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య అక్టోబర్‌లో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ వాయిదా పడింది

కరోనా వైరస్ ధాటికి అన్ని రంగాల్లాగానే క్రీడా రంగం సైతం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య అక్టోబర్‌లో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ వాయిదా పడింది.

ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం ప్రకటించింది. విండీస్ క్రికెట్ బోర్డుతో చర్చించిన తర్వాతే తామీ నిర్ణయం తీసుకున్నట్లు సీఏ వెల్లడించింది. టీ 20 ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌గా సీఏ దీనిని ఏర్పాటు చేసింది.

ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబర్ 4,6,9వ తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జరిగేలా షెడ్యూల్‌ను రూపొందించింది. అయితే కరోనా విజృంభణతో ఈ ఏడాది జరగాల్సిన టీ 20 ప్రపంచకప్ వచ్చే ఏడాదికి వాయిదా పడటం.. ఐపీఎల్ కూడా సరిగ్గా అదే సమయంలో జరగనుండటంతో సిరీస్‌ను వాయిదా వేసినట్లు సమాచారం.

సెప్టెంబర్‌లో వన్డే సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి వుంది. అయితే ఈ సిరీస్ గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి వచ్చింది. 

click me!