37 బంతుల్లో ఆఫ్రిది సెంచరీ... సచిన్ బ్యాటే కారణం

By Siva KodatiFirst Published Aug 4, 2020, 2:53 PM IST
Highlights

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత రెండో మ్యాచ్‌లోనే వన్డేల్లో వేగవంతమైన సెంచరీ సాధించాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత రెండో మ్యాచ్‌లోనే వన్డేల్లో వేగవంతమైన సెంచరీ సాధించాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది. సుమారు 18 ఏళ్ల పాటు ఆ రికార్డును తనపేరిటే ఉంచుకున్నాడు.

1996లో నైరోబిలో శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో 16 ఏళ్ల వయసులో ఆఫ్రిది ఈ ఘనత సాధించాడు. అయితే ఆయన అద్భుత ఇన్సింగ్స్ వెనుక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పాత్ర ఉందని ఆఫ్రిది సహచరుడు అజహర్ మహమూద్ వెల్లడించాడు.

నాటి మ్యాచ్‌లో సచిన్ ఇచ్చిన బ్యాట్‌తోనే షాహిద్ 37 బంతుల్లో శతకం సాధించాడని అజహర్ తెలిపాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహమూద్ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.

Aslo Read:గంభీర్ కి మానసిక సమస్య.. మరోసారి నోరుపారేసుకున్న అఫ్రీది

1996లో ఆఫ్రిది అరంగేట్రం చేశాడు. ముస్తాక్ అహ్మద్ గాయపడటంతో పాకిస్తాన్ ఎ పర్యటనలో ఉన్న ఆఫ్రిదికి నేషనల్ టీమ్‌కు ఆడే అద్భుత అవకాశం లభించిందని అజహర్ చెప్పాడు.

అయితే తొలి మ్యాచ్‌లో అతనికి బరిలోకి దిగే అవకాశం దక్కలేదు. శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగిన అతను 40 బంతుల్లో 104 పరుగులు చేసి హాట్ టాపిక్‌గా మారాడు. ఆ మ్యాచ్‌లో అతను వాడిన బ్యాట్‌ను సచిన్ వకార్‌కిచ్చాడు.

వకార్ నుంచి ఆ బ్యాట్ ఆఫ్రిది చేతుల్లోకి వచ్చిందని అజహర్ చెప్పాడు. అంతకుముందు బౌలర్‌గానే గుర్తింపు తెచ్చుకున్న ఆఫ్రిది.. సచిన్ బ్యాట్‌తో ప్రపంచంలోని విధ్వంసకర ఆటగాళ్లలో ఒకడిగా మారిపోయాడని అజహర్ మహమూద్ వివరించాడు. 

click me!