చాలా లావున్నారు.. కొంచెం బలుపు తగ్గించుకోండి : ఇంగ్లాండ్ ఆటగాళ్లపై ఓ తుంటరి ఫ్యాన్ బాడీ షేమింగ్ కామెంట్స్

Published : Jan 07, 2022, 04:01 PM IST
చాలా లావున్నారు.. కొంచెం బలుపు తగ్గించుకోండి : ఇంగ్లాండ్ ఆటగాళ్లపై ఓ తుంటరి ఫ్యాన్ బాడీ షేమింగ్ కామెంట్స్

సారాంశం

Ashes Live:  యాషెస్ సిరీస్ లో ఆటగాళ్లు ఒకరిమీద ఒకరు స్లెడ్జింగ్ చేసుకోవడం కామనే.. కానీ తాజాగా స్టేడియంలోకి క్రికెట్ చూడటానికి వచ్చిన ఓ వ్యక్తి ఇంగ్లాండ్ ఆటగాళ్లను దారుణంగా అవమానించాడు.

యాషెస్ అంటేనే ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ హోరాహోరి తలపడుతాయి. స్లెడ్జింగ్ లో ఆరితేరిన ఈ జట్లు.. ‘నువ్వెంత అంటే నువ్వెంత..?’ అనే  స్థాయి వరకు వెళ్తాయి. కానీ ఈ సిరీస్ లో ఇంగ్లాండ్.. ఇప్పటికే మూడు టెస్టులలో ఓడపోవడంతో పాటు గబ్బా టెస్టు నుంచి ఆసీస్ కు తొందరగానే లొంగుతుండటంతో కంగారూలకు స్లెడ్జింగ్ చేసే  అవసరమేమీ రావడం లేదు.  ఆసీస్ ఆటగాళ్లు కామ్ గా ఉన్నా స్టేడియానికి  వచ్చే అభిమానులు అంత ఓపికగా ఉండటం లేదు. ఇంగ్లాండ్ కు చెందిన బర్మీ ఆర్మీ, ఆసీస్ అభిమానులు.. ప్రత్యర్థి ఆటగాళ్లను టార్గెట్ గా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా నాలుగో టెస్టు సందర్భంగా సిడ్నీ గ్రౌండ్ లో  ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్-జానీ బెయిర్ స్టో కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. 

సిడ్నీ టెస్టులో ఆసీస్ 416-8 వద్ద డిక్లేర్ చేయగా.. తొలి ఇన్నింగ్స్  ప్రారంభించిన ఇంగ్లాండ్.. మూడో రోజు లంచ్ కు ముందే 36 పరుగులే చేసి నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్- బెయిర్ స్టో ఆ జట్టును ఆదుకున్నారు. అయితే రెండో సెషన్ లో టీ విరామం కోసం ఈ ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తుండగా ఓ అభిమాని  వారిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు. 

స్టోక్స్ - బెయిర్ స్టో  బౌండరీ లైన్ దాటగానే.. ‘ స్టోక్స్ నువ్వు చాలా లావుగా ఉన్నావు...’ ఇది విన్న ఆ ఇద్దరు అది పట్టించుకోకుండా డ్రెస్పింగ్ రూమ్ కు వెళ్లబోయారు. మళ్లీ అదే వ్యక్తి.. ‘బెయిర్ స్టో నువ్వు ఆ జంపర్ తీసేయి..  ఈ మధ్య చాలా బరువెక్కావు.. కొంచెం వెయిట్ తగ్గు..’అంటూ వాగాడు.  దీంతో స్టోక్స్, బెయిర్ స్టో అక్కడే కాసేపు ఆగారు. 

 

ఆ వ్యాఖ్యలు చేసిన  వ్యక్తివైపు తదేకంగా చూస్తూ బెయిర్ స్టో.. ‘అవును కరెక్టే.. అటువైపు తిరిగి ముందుకు నడుచుకుంటూ వెళ్లు..’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ టీమ్  డైరెక్టర్ ఆష్లే గైల్స్ అక్కడే ఉన్నాడు. స్టోక్స్, బెయిర్ స్టో లను డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లమని అతడు సూచించడంతో వాళ్లిద్దరు లోపలికి వెళ్లారు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

కాగా సిడ్నీ  టెస్టులో మూడో రోజు  ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో స్టోక్స్.. (66), బెయిర్ స్టో (103 నాటౌట్) లు ఇంగ్లాండ్ ను ఆదుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఇంకా 158 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో  ఆసీస్.. 416 పరుగులకు డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

IPL Brand Value: ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ బ్రాండ్ విలువ ఢమాల్ ! కష్టమేనా?
ICC Rankings : వన్డే కింగ్ ఎవరు? రోహిత్ శర్మకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లీ.. కేవలం 8 పాయింట్లు !