Shane Warne: క్రికెట్ ప్రపంచానికి బిగ్ షాక్.. స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూత..

Published : Mar 04, 2022, 07:58 PM ISTUpdated : Mar 04, 2022, 08:24 PM IST
Shane Warne: క్రికెట్ ప్రపంచానికి బిగ్ షాక్.. స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూత..

సారాంశం

Shane Warne Passes away: ఆస్ట్రేలియాకు చెందిన  ప్రముఖ స్పిన్నర్ షేన్ వార్న్  ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో.. 

ఆస్ట్రేలియా క్రికెట్ కు శుక్రవారం దుర్దినం. ఈరోజు ఉదయాన్నే  ఆ జట్టు మాజీ క్రికెటర్ రోడ్నీ మార్ష్ మరణించగా.. కొద్దిసేపటి క్రితమే ఆ దేశానికి చెందిన ద మరో క్రికెట్ దిగ్గజం, లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురవడంతో ఆయన  ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 52 ఏండ్ల వార్న్.. థాయ్ లాండ్ లో ఉన్న తన విల్లాలో గుండెపోటు రావడంతో అతడి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే వార్న్ అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. వార్న్ మరణవార్త తెలిసి అతడి అభిమానులు షాక్ కు గురయ్యారు. ఈ వార్త నిజం కాకుంటే బాగుండు అని కన్నీరుమున్నీరవుతున్నారు.  

శుక్రవారం తన విల్లాలో ఎలాంటి స్పందన లేకుండా పడిఉండటంతో అతడి కుటుంబ సభ్యులు వార్న్ ను  ఆస్పత్రికి తరలించారు. ఉన్నట్టుండి కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) రావడంతోనే  వార్న్ మరణించినట్టు తెలుస్తున్నది. వార్న్ మరణానికి సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.  

 

కాగా.. సుమారు రెండు దశాబ్దాల పాటు ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్లందరినీ తన స్పిన్ మాయాజాలం తో  చెమటలు పట్టించిన దిగ్గజ క్రికెటర్ మరణం పట్ల దిగ్గజ క్రికెటర్లు, ప్రపంచ క్రికెట్  ప్రేమికులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

 

తన కెరీర్ లో 145 టెస్టులు ఆడిన వార్న్.. 708 వికెట్లు తీశాడు.  టెస్టు క్రికెట్ చరిత్రలో  అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు) తర్వాత స్థానం వార్న్ దే.. టెస్టులలో 37 సార్లు 5 వికెట్లు, 10 సార్లు పది వికెట్లు పడగొట్టాడు.  ఆసీస్ తరఫున  వన్డేలలో 194 మ్యాచులు ఆడి 293 వికెట్లు పడగొట్టాడు. 

1992లో జాతీయ జట్టుకు ఎంపికైన వార్న్.. ఆనతి కాలంలోనే  కీలక ఆటగాడిగా ఎదిగాడు. సుమారు  పదిహేనేళ్ల పాటు ఆసీస్  క్రికెట్ కు సేవలందించాడు. కాగా వార్న్ మృతిపై  క్రికెటర్లు సంతాపం ప్రకటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Shubman Gill : షాకింగ్ డెసిషన్.. భారత్ సిరీస్ ఓడిపోగానే గిల్ ఏం చేశాడో తెలుసా?
Virat Kohli : ధోనీనా? రోహితా? కోహ్లీకి కలిసొచ్చిన కెప్టెన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !