
IPL 2024 Auction LIVE updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్లేయర్స్ వేలంలో మరో రికార్డు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి సారి ఒక ప్లేయర్ 20 కోట్ల రూపాయలు దక్కాయి. అతనే ఆస్ట్రేలియన్ ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 హీరో, ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ను ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. అనుకున్నట్టుగానే అతన్ని భారీ ధరలో హైదరాబాద్ టీం సొంతం చేసుకుంది. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ ఏకంగా ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోని విధంగా రూ.20.50 కోట్లు పెట్టి దక్కించుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఒక ఆటగాడికి 20 కోట్ల రూపాయలు దాటి చెల్లించడం మొదటిసారి.
ప్యాట్ కమిన్స్ బేస్ ధర రూ.2 కోట్లు కాగా, అతని ధరం ఏకంగా 20.50 కోట్ల రూపాయలు పలికి సంచలనానికి తెరలేపింది. హైదరాబాద్, బెంగళూరు జట్లు అతని కోసం పోటీ పడ్డాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా రూ.4.80 కోట్ల తర్వాత వేలం వేయడం ప్రారంభించింది. కమిన్స్ 128 టీ20 మ్యాచ్‌లు ఆడి 143 వికెట్లు తీశాడు. అతను బ్యాట్‌తోనూ రాణించగలడు. చెన్నై కూడా అతని పై ఆసక్తి చూపింది. కానీ వేలంలో ఊహించని విధంగా ఏకంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ నిలిచాడు.
IPL 2024 Auction: వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ ను సొంతం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్
IPL 2024 Auction:హ్యారీ బ్రూక్ ను సొంతం చేసుకున్న ఢిల్లీ.. ధర ఎంతంటే..