ఈసారి వన్డే ప్రపంచకప్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేక.. డీలా పడిపోయిన మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా .. పసికూన నెదర్లాండ్స్‌పై జూలు విదిల్చింది. ఏకంగా 309 పరుగుల తేడాతో ఆ జట్టును ఓడించి ఘన విజయం సాధించింది.
ఈసారి వన్డే ప్రపంచకప్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేక.. డీలా పడిపోయిన మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా .. పసికూన నెదర్లాండ్స్‌పై జూలు విదిల్చింది. ఏకంగా 309 పరుగుల తేడాతో ఆ జట్టును ఓడించి ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 399 పరుగులు చేసింది. దీనిని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ 90 పరుగులకే కుప్పకూలింది. అంతేకాదు.. ప్రపంచకప్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం.
మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. నెదర్లాండ్స్ బౌలర్లను ఊచకోత కోసిన ఆసీస్ బ్యాట్స్‌మెన్లు భారీ షాట్లతో హోరెత్తించారు. డేవిడ్ వార్నర్ (104), స్టీవ్ స్మిత్ (71), లబుషేన్ (62) పరుగులు చేశారు. ఇక చివరిలో మ్యాక్స్‌వెల్ (106) సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 44 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో ప్రపంచకప్ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 399 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్ 4, బాస్ డి లీడే 2, ఆర్యన్ దత్ ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు వణికించారు. దీంతో కేవలం 21 ఓవర్లలోనే 9 పరుగులకే డచ్ జట్టు ఆలౌటౌంది. ఆడమ్ జంపా 4, మిచెల్ మార్ష్ 2, స్టార్క్, హేజిల్ వుడ్, కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు. నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ విక్రమ్ జిత్ సింగ్ (25) ఒక్కటే టాప్ స్కోరర్.