డేవిడ్ వార్నర్‌కి రెస్ట్... టీమిండియాతో టీ20 సిరీస్‌కి ఆస్ట్రేలియా జట్టు ఇదే..

By Chinthakindhi Ramu  |  First Published Nov 21, 2023, 3:31 PM IST

సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కి రెస్ట్.. 2023 వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొన్న ట్రావిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లీష్, ఆడమ్ జంపా‌లకు ప్లేస్.. 


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగియడంతో భారత సీనియర్ ప్లేయర్లు అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఆస్ట్రేలియా మాత్రం టీమిండియాతో టీ20 సిరీస్‌లో పూర్తి జట్టుతో బరిలో దిగుతోంది. సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం ఈ టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు..

2023 వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొన్న ట్రావిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లీష్, ఆడమ్ జంపా... భారత జట్టుతో జరిగే టీ20 సిరీస్‌లో పాల్గనబోతున్నారు. 

Latest Videos

ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ తర్వాత మాథ్యూ వేడ్ కెప్టెన్సీలో టీ20లు ఆడుతూ వస్తోంది ఆస్ట్రేలియా. భారత జట్టుతో టీ20 సిరీస్‌కి కూడా అతనే కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. 

టీమిండియాతో ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌కి ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లీష్, ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబ్బాట్, నాథన్ ఎల్లీస్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా
 

click me!