డబ్బుల కోసం మనుషులు ఏమైనా చేస్తారు: కోహ్లీపై బ్రాడ్ హాడ్జ్ వ్యంగ్యాస్త్రాలు

Published : May 18, 2019, 06:40 PM IST
డబ్బుల కోసం మనుషులు ఏమైనా చేస్తారు: కోహ్లీపై బ్రాడ్ హాడ్జ్ వ్యంగ్యాస్త్రాలు

సారాంశం

టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై ఆసిస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడ్జ్ నోరుపారేసుకున్నాడు. కోహ్లీ వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని... సంబంధం లేని విషయంలో తలదూర్చి మరీ హాడ్జ్ విమర్శలకు దిగాడు. కోహ్లీ చేసిన ఓ యాడ్ పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఇటీవల కోహ్లీ యువ క్రికెటర్ రిషబ్  పంత్ తో కలిసి ఓ మెన్స్ ఫెయిర్ నెపస్ క్రీమ్ యాడ్ లో నటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కోహ్లీ అధికారిక  ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ పై ఆసిస్ మాజీ క్రికెటర్ హాడ్జ్ ఘాటుగా విమర్శలకు దిగాడు. 

''అద్భుతం.. డబ్బుల కోసం మనుషులు ఏమైనా చేస్తారు'' అంటూ కోహ్లీ ట్వీట్ కు రీట్వీట్ చేశాడు. ఇలా కోహ్లీ డబ్బుల కోసం ఏమైనా చేస్తాడన్న హాడ్జ్ ట్వీట్ పై అభిమానులు ఆగ్రహాన్ని చవిచూస్తున్నాడు. ఇలా నెటిజన్ల  విమర్శలపై స్పందిస్తూ మళ్లీ హాడ్జ్ '' నేను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు...మీరే  తప్పుగా అర్థం చేసుకున్నారు'' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో  అభిమానుల ఆగ్రహం మరింత ఎక్కువయ్యింది. 

''ముందు మీ జట్టు గురించి ఆలోచించు...మీరు గెలుపు కోసం ఏం చేస్తున్నారో అర్థమవుతుంది'' అని కొందరు, '' మీరు (ఆస్ట్రేలియా ఆటగాళ్లు) ప్రతి సంవత్సరం ఇండియా వచ్చి సంపాదించుకుపోవడం లేదా'' మరికొందరు  నెటిజన్లు హాడ్జ్ ట్వీట్ పై ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IND vs BAN : తగ్గేదే లే.. బంగ్లాదేశ్ కు ఇచ్చిపడేసిన భారత్.. గ్రౌండ్‌లో హీట్ పుట్టించిన కెప్టెన్లు !
Vaibhav Suryavanshi : ఊచకోత అంటే ఇదే.. బంగ్లా బౌలర్లని ఉతికారేసిన వైభవ్ ! కోహ్లీ రికార్డు పాయే