సొంత భార్యపైనే ఒలింపిక్ క్రీడాకారుడి వేధింపులు...పోలీస్ కేసు నమోదు

By Arun Kumar PFirst Published May 18, 2019, 4:24 PM IST
Highlights

భారత రోవింగ్ క్రీడాకారుడు దత్తు బాబన్ భోకనోల్ పై వేధింపుల  కేసు నమోదయ్యింది. గత కొంత కాలంగా అతడు తనను  శారీరకంగా, మానసికంగా వేదిస్తున్నాడంటూ అతడి భార్య నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో  అతడిపై  పోలీసులు ఐపీసీ  498 ఎ, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

దత్తు భార్య నాసిక్ రూరల్  పోలీస్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తోంది. తనకు 2017 లో హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం జరిగిందని ఆమె తెలిపింది. పెళ్ళి  తర్వాత కొద్దిరోజులు బాగానే వున్నా ఆ  తర్వాత అతడు  నిజస్వరూపాన్ని బయటపెట్టాడని...నిత్యం తనను మానసికంగా, శారీరకంగా వేధించడం ఆరంభించాడని ఆమె తానిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 

దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి బిజ్లీ వెల్లడించారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు వేధింపులు నిజమని  తమ విచారణలో తేలితే అతన్ని అరెస్ట్ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశాడు.     

భారత్ తరపున రియో ఒలింపిక్స్ లో పాల్గొన్న ఏకైక రోవర్ దత్తు భోకనోల్ గతంలో రికార్డు సృష్టించాడు.అంతే కాదు భారత దేశం నుండి ఒలింపిక్స్ లో పాల్గొన్న తొమ్మిదవ రోవర్ గా నిలిచాడు. ఇక 2018 లో జరిగిన  ఆసియన్ గేమ్స్ మెన్స్ క్వాడ్రపుల్ స్కల్స్ లో ఇతడు గోల్డ్ మెడల్ సాధించాడు. ఇలా ఉత్తమ క్రీడాకారుడిగా రాణిస్తున్న సమయంలో ఇలా వేధింపుల కేసులో చిక్కుకోవడం అతడి కెరీర్ పై ప్రభావం చూపించే అవకాశముంది. 

click me!