Boxing Day Test: ఆస్ట్రేలియా, పాకిస్తాన్ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ సందర్భంగా ఒక యువజంట స్టేడియంలో రొమాన్స్ చేస్తూ కెమెరాకు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Young Couple Gets Shocked On Big Screen: ఆస్ట్రేలియా, పాకిస్తాన్ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ లో చిత్రవిచిత్రమైన ఘటనల పరంపర కొనసాగుతూనే ఉంది. మరో ఘటన వైరల్ గా మారింది. సాధారణంగా క్రికెట్ చూడటానికి వెళ్లిన అభిమానులు తమను గ్రౌండ్ లో ఉన్న పెద్ద స్క్రీన్ లపై చూసుకోవడానికి ఇష్టపడతారు. దాని కోసం ఒక్కోసారి విచిత్రమైన పనులు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, తము ఆ బిగ్ స్క్రీన్ పై చూసుకుని ఆనందపడతారు.. కానీ దీనికి భిన్నంగా ఒక జంట తమను గ్రౌండ్ లోని బిగ్ స్క్రీన్ పై చూసుకుని ముఖాలు కనిపించకుండా తిప్పుకుంది.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎందుకు ఇలా చేసి ఉంటారనే కదా.. మీ ప్రశ్న.. !
ఆ స్క్రీన్ పై కనిపించిన యువ జంట రొమాన్స్ లో మునిగి ఉన్న సమయంలో కెమెరాకు దొరికిపోయారు. తమ ప్రైవేట్ మూమెంట్స్ ను స్క్రీన్ పై చూపించడంతో ఆ జంట షాక్ అయింది. ఎంసీజీలో ఆసీస్-పాక్ యాక్షన్ చూస్తున్న అభిమానులు కేరింతలో కొడుతుండగా, స్టాండ్స్ లో రొమాన్స్ లో మునిగిపోయిన యువ జంటపై కెమెరామెన్ ఫోకస్ చేసినప్పుడు బిగ్ స్క్రీన్ పై కనిపించారు. తెరపై తమను తాము చూడగానే షాక్ కు గురైన ఈ జంట వెంటనే విడిపోయారు. ఆ యువకుడు వెంటనే టవల్ తో తన ముఖాన్ని దాచుకోగా, యువతి తనను గుర్తుపట్టకుండా కెమెరాకు వ్యతిరేకంగా మరో వైపు చూడటం షురూ చేసింది. ఒక్కసారిగా ఈ సన్నివేశం చూసిన గ్రౌండ్ లో షాక్.. నవ్వులు రెండు ఒకేసారి కనిపించాయి.
Wait a minute what did we all just see? Yet you are complaining about missed catches? 🤷🏻♀️🤡 pic.twitter.com/8yA6pCagXv
— Kinza Tariq (@Kinnzayyy)
అంతర్జాతీయ క్రికెట్ లో వారిది చెత్త ఫీల్డింగ్.. : గౌతమ్ గంభీర్