కేఎల్ రాహుల్ కి భార్య అతియా సపోర్ట్... గంభీర్ ముసిముసి నవ్వులు..!

Published : Apr 29, 2023, 11:02 AM IST
కేఎల్ రాహుల్ కి భార్య అతియా సపోర్ట్... గంభీర్ ముసిముసి నవ్వులు..!

సారాంశం

శుక్రవారం రాత్రి పంజాబ్‌పై లక్నో విజయం సాధించినప్పుడు అతను నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

ఐపీఎల్ మ్యాచులు రసవత్తరంగా జరుగుతున్నాయి. నిన్న మొహాలీలో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పంజాబ్ ని లక్నో చిత్తుగా ఓడించింది.  లక్నో సూపర్ జెయింట్ పంజాబ్ కింగ్స్‌ను 56 పరుగుల తేడాతో ఓడించింది. 258 పరుగుల ఛేదనలో పంజాబ్ డీలా పడిపోయింది. పంజాబ్ కింగ్స్ 201 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. లక్నో మాత్రం.. 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు చేసింది, IPL చరిత్రలో ఇది రెండవ అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.

IPL 2023 మ్యాచ్‌లో PBKSపై LSG భారీ విజయం సాధించిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ సంతోషం పట్టలేకపోయాడు. మ్యాచ్ ఆధ్యంతం ముసి ముసి నవ్వులు చిందిస్తూనే ఉన్నాడు.. శుక్రవారం రాత్రి పంజాబ్‌పై లక్నో విజయం సాధించినప్పుడు అతను నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.


బాలీవుడ్ నటి, LSG కెప్టెన్ కేఎల్ రాహుల్ భార్య  అథియా శెట్టి.. తన భర్తను ఉత్సాహపరిచేందుకు స్టేడియంకి వచ్చింది. మ్యాచ్ మొత్తం భర్తను ఉత్సాహపరిచింది. ఇక.. తన భర్త టీమ్ విజయం సాధించడంతో.. ఆమె సంతోషం వ్యక్తం చేసింది. భార్య స్టేడియం కి రావడంతో ఆమె అతనికి లక్కీ ఛాంప్ గా మారింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

మార్కస్ స్టోయినిస్ ఈ మ్యాచ్ లో  ఆల్ రౌండ్ షో చేశాడు. మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్,  బౌలింగ్ రెండింటిలోనూ సత్తా చాటాడు. ఈ ఆల్ రౌండర్ కేవలం 40 బంతుల్లో 72 పరుగులు చేయడంతో లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల స్కోరును చేరుకుంది. ఒక వికెట్ కూడా తీశాడు. దీంతో..  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పొందాడు.

పంజాబ్ కింగ్స్‌పై వారి 56 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. లక్నో సూపర్ జెయింట్స్ IPL 2023 పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్స్ లో  రెండవ స్థానానికి ఎగబాకింది.
 

PREV
click me!

Recommended Stories

Rohit Sharma : హిట్ మ్యాన్ కెరీర్ లో అత్యంత కఠిన సమయం ఇదే.. అసలు విషయం చెప్పిన రోహిత్!
కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?