కెప్టెన్ కూల్ కి కోపం వచ్చిందా..? వైరల్ అవుతున్న వీడియో..!

Published : Apr 29, 2023, 09:35 AM IST
కెప్టెన్ కూల్ కి కోపం వచ్చిందా..? వైరల్ అవుతున్న వీడియో..!

సారాంశం

అలాంటి కెప్టెన్ కూల్ కి కూడా కోపం వచ్చింది. మీకు నమ్మాలనిపించకపోయినా అదే నిజం. ధోనీకి కోపం వచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ధోనీకి కోపం రాగా, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

మహేంద్ర సింగ్ ధోనీ అనగానే ఎవరికైనా ఏం గుర్తుకు వస్తుంది..? ఆయన శాంత స్వభావం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా ప్రశాంతంగా, కూల్ గా ఉంటాడు. అందుకే ఆయనను కెప్టెన్ కూల్ అని పిలుస్తారు. అలాంటి కెప్టెన్ కూల్ కి కూడా కోపం వచ్చింది. మీకు నమ్మాలనిపించకపోయినా అదే నిజం. ధోనీకి కోపం వచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ధోనీకి కోపం రాగా, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఐపీఎల్ 2023లో భాగంగా శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో చెన్నై ఆటగాడు మతీషా పతీరానా పై ధోనీ కోపంతో అరిచేశాడు. ధోనీకి అంత కోపం రావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. రాజస్థాన్ రాయల్స్  ఇన్నింగ్స్‌లోని 16వ ఓవర్‌లో ధోని షిమ్రాన్ హెట్‌మెయర్‌ను స్టంప్‌ల వెనుక నుండి రనౌట్ చేసే అవకాశం ఉంది, కానీ పతిరానా తన మార్గంలో ముందు నిలబడి ఉండటంతో అతను త్రోను పూర్తి చేయలేకపోయాడు. దీంతో కోపం వచ్చిన ధోని పతీరానాపై అరిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. శ్రీలంకకి చెందిన పతిరనకి ఇదే తొలి ఐపీఎల్ సీజన్‌కాగా.. లసిత్ మలింగ తరహాలో అతని బౌలింగ్ యాక్షన్ ఉండటంతో అందరూ పతిరనని జూనియర్ మలింగ అని పిలుస్తున్నారు.

 

ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 170 పరుగులే చేయగలిగింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై, రాజస్థాన్ జట్లు రెండు సార్లు తలపడగా.. రెండింటిలోనూ రాజస్థాన్ జట్టే గెలుపొందడం గమనార్హం.

ఐపీఎల్ 2023లో చెన్నై 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు రాజస్థాన్ 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Rohit Sharma : హిట్ మ్యాన్ కెరీర్ లో అత్యంత కఠిన సమయం ఇదే.. అసలు విషయం చెప్పిన రోహిత్!
కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?