ఏషియన్ గేమ్స్ 2023: యశస్వి జైస్వాల్ సెంచరీ! టీమిండియా సెమీస్‌కి... పోరాడి ఓడిన నేపాల్...

By Chinthakindhi Ramu  |  First Published Oct 3, 2023, 1:46 PM IST

నేపాల్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో గెలిచిన భారత పురుషుల జట్టు... యశస్వి జైస్వాల్ సెన్సేషనల్ సెంచరీ.. 


ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీ ఫైనల్‌కి ప్రవేశించింది. నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో గెలిచిన భారత పురుషుల జట్టు, అక్టోబర్ 6న సెమీ ఫైనల్ ఆడనుంది..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ స్కోరు చేసింది. యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు చేసి... టీ20ల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..

Latest Videos

undefined

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి తొలి వికెట్‌కి 103 పరుగుల భాగస్వామ్యం జోడించాడు యశస్వి జైస్వాల్. 23 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, దీపేంద్ర సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

10 బంతుల్లో 2 పరుగులు చేసిన తిలక్ వర్మ, సోమ్‌పాల్ కమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఓ ఫోర్ బాది అవుట్ కావడంతో వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా..

 సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్ కూడా దీపేంద్ర బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. శివమ్ దూబే 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేయగా రింకూ సింగ్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు..

203 పరుగుల భారీ లక్ష్యఛేదనలో నేపాల్ జట్టు, 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆసీఫ్ షేక్ 10, కుసాల్ బుర్టెల్ 28, కుసాల్ మల్లా 29, దీపేంద్ర సింగ్ ఆరీ 32, సందీప్ జోరా 29, కరణ్ కేసీ 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్, రవి భిష్ణోయ్ మూడేసి వికెట్లు తీయగా అర్ష్‌దీప్ సింగ్‌కి 2 వికెట్లు దక్కాయి. 

రవిశ్రీనివాసన్ సాయికిషోర్‌కి ఓ వికెట్ దక్కగా వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే వికెట్లు తీయలేకపోయారు. రెండో క్వార్టర్ ఫైనల్‌లో మ్యాచ్‌లో పాకిస్తాన్-హంగ్‌కాంగ్‌తో తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 160 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

రేపు శ్రీలంక-ఆఫ్ఘాన్ మధ్య మూడో క్వార్టర్ ఫైనల్, బంగ్లాదేశ్ - మలేషియా మధ్య నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. 

click me!