India vs Malaysia: వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయిన క్వార్టర్ పైనల్ మ్యాచ్.. భారీ స్కోరు చేసిన భారత మహిళా జట్టు..
ఏషియన్ గేమ్స్ 2023 పోటీలు సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కాబోతున్నా... క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్ పోటీలు మాత్రం సెప్టెంబర్ 19 నుంచి మొదలైపోయాయి. ఏషియన్ గేమ్స్ వుమెన్స్ టీ20 పోటీల్లో భాగంగా నేడు క్వార్టర్ ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి. మలేషియాతో జరిగుతున్నమొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్, వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయ్యింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న భారత మహిళా జట్టు, నేరుగా సెమీ ఫైనల్‌కి అర్హత సాధించింది.త..
టాస్ గెలిచిన మలేషియా, బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు, 15 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం కలగడంతో మ్యాచ్‌ని 15 ఓవర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు.
undefined
భారత బ్యాటర్లు మొదటి ఓవర్ నుంచే మలేషియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి 62 పరుగులు చేసింది టీమిండియా. తొలి వికెట్‌కి 57 పరుగులు జోడించిన తర్వాత కెప్టెన్ స్మృతి మంధాన అవుటైంది. 16 బంతుల్లో 5 ఫోర్లతో 27 పరుగులు చేసిన స్మృతి మంధాన, మహీరా ఇజ్జతీ ఇస్మాయిల్ బౌలింగ్‌లో అవుటైంది..
స్మృతి మంధాన అవుటైన తర్వాత వర్షం కురిసి, గంట సేపు ఆట నిలిచిపోయింది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ బౌండరీల మోత మోగించారు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన షెఫాలీ వర్మ, ఏషియన్ గేమ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది.
ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్ ఎప్పటి నుంచో ఉంది. అయితే భారత్ నుంచి క్రికెట్ జట్లు, ఏషియన్ గేమ్స్‌లో ఆడడం మాత్రం ఇదే మొదటిసారి. దీంతో స్మృతి మంధాన ఖాతాలో అరుదైన ఘనత చేరింది. 39 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేసిన షెఫాలీ వర్మ, మస్ ఎలీసా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యింది.
మస్ ఎలీసా వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా 4,6, 4, 4 బాదిన యంగ్ బ్యాటర్ రిచా ఘోష్ 20 పరుగులు రాబట్టి, టీమిండియాకి భారీ స్కోరు అందించింది. జెమీమా రోడ్రిగ్స్ 29 బంతుల్లో 6 ఫోర్లతో 47 పరుగులు చేయగా, రిచా ఘోష్ 7 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసింది..
భారత ఇన్నింగ్స్ తర్వాత మలేషియా బ్యాటింగ్ మొదలెట్టగానో మరోసారి వర్షం కారణంగా మ్యాచ్ ఆగింది. ఆట వల్ల మ్యాచ్ నిలిచే సమయానికి 2 బంతుల్లో 1 పరుగు చేసింది మలేషియా. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో టాప్ ర్యాంకులో ఉన్న భారత జట్టు, సెమీ ఫైనల్‌కి అర్హత సాధించింది. సెప్టెంబర్ 24న ఉమెన్స్ క్రికెట్ సెమీ ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. బంగ్లా టూర్‌లో అనుచిత ప్రవర్తన కారణంగా టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ రెండు మ్యాచుల నిషేధం విధించింది.
ఈ కారణంగా నేటి మ్యాచ్‌కి స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ భారత సారథిగా స్మృతియే ఉంటుంది. సెమీ ఫైనల్‌లోనూ గెలిస్తే, ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ రీఎంట్రీ ఇస్తుంది. పాకిస్తాన్- ఇండోనేషియాతో, శ్రీలంక- థాయిలాండ్‌తో, బంగ్లాదేశ్- హంగ్ కాంగ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచులు ఆడుతున్నాయి.