జడేజా బ్యాటింగ్ లో విఫలం, ఇండియాకు కష్టమే: దినేష్ కార్తిక్

By Pratap Reddy Kasula  |  First Published Sep 16, 2023, 3:44 PM IST

భారత్ ఆల్ రౌేండర్ రవీంద్ర జడేజా బ్యాటింగులో విఫలం అవుతుండడంపై దినేష్ కార్తిక్ స్పందించాడు. జడేజా బ్యాటింగ్ లో విఫలం కావడాన్ని భాతర జట్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కార్తిక్ అన్నాడు.


ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వన్డేల్లో పరుగులు చేయలేకపోవడం వచ్చే వన్డే ప్రపంచ కప్ పోటీల్లో ఇండియా జట్టుకు కష్టమే అవుతుందని భారత వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ దినేష్ కార్తిక్ అన్నాడు. ఆసియా కప్ పోటీల్లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శుక్రవారం కొలంబోలో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ మీద భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.

మ్యాచ్ లో సెంచరీ బాదిన శుబ్ మన్ గిల్ కు అండగా నిలువడంతో రవీంద్ర జడేజా విఫలమయ్యారు. కేవలం ఏడు పరుగులే చేసిన జడేజా ఇన్నింగ్స్ 38వ ఓవరులో అవుటయ్యాడు. శుబ్ మన్ గిల్ ఓ వైపు చెలరేగి ఆడుతున్న సమయంలో మరో వైపు అనుభవం ఉన్న ఆటగాడిగా రవీంద్ర జడేజా వికెట్ల నిలబడి ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Latest Videos

undefined

షాట్ ను ఆడడంలో జడేజా అనుభవాన్ని ప్రదర్శించలేకపోయాడు. భారీ షాట్ కు వెళ్లి అతను అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. అక్షర్ పటేల్ దూకుడుగా ఆడి 42 పరుగులు చేవాడు. శుబ్ మన్ గిల్ చేసిన 121 పరుగుల వ్యక్తిగత స్కోరు ఫలితం ఇవ్వకుండా పోయిందది.

రవీంద్ర జడేజా ఆసియా కప్ టోర్నమెంటులో పరుగులు రాబట్టుకోవడంలో వరుసగా విఫలమవుతూ వచ్చారు. ఇప్పటి వరకు మూడు ఇన్నింగ్సు ఆడి కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. భారత్ స్పిన్ బౌలర్ గా, ఆల్ రౌండర్ గా జడేజాపై ఎంతో నమ్మకం పెట్టుకుంది. ఇటువంటి స్థితిలో అతను బ్యాటింగ్ లో సత్తా చాటలేకపోతున్నాడు.

రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్ లో అసమానమైన ప్రతిభ చూపాడని, వైట్ బాల్ ఫార్మాట్ లో సత్తా చాటాల్సే ఉందని దినేష్ కార్తిక్ అన్నాడు. జడేజా బాగా ఆడిన పత్రి సారీ భారత్ మంచి ఫలితాలు సాధించిందని, 2013 ఛాంపియన్ ట్రోఫీనే తీసుకుంటే జడేజా బాగా ఆడాడని ఆయన అన్నారు. భారత్ కు జడేజా కీలకమైన ఆటగాడని, బౌలింగ్ లో అంతగా రాణించకపోయినా భారత్ కు ఇబ్బంది లేదని, అయితే బ్యాటింగ్ లో సత్తా చాటకపోతేనే సమస్య ఎదురవుతుందని ఆయన అన్నారు. 

తిరిగి 2022లో జట్టులోకి వచ్చిన తర్వాత జడేజా 50 ప్లస్ పరుగులు చేసిన సందర్భం లేదు. 56 స్ట్రయికింగ్ రేటులతో 2023లో జడేజా 11 మ్యాచుల్లో కేవలం 138 పరుగులు మాత్రమే చేశాడు.

click me!