రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే ఆసియా కప్‌లో టీమిండియా ఎదుర్కొన్న మొదటి ఓటమి కూడా ఇదే. 266 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 49.5 ఓవర్లలో 259 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా తొలి పరాజయాన్ని అందుకుంది. పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్, భారత జట్టుపై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. నామమాత్రపు మ్యాచ్‌లో 5 మార్పులతో బరిలో దిగిన భారత జట్టు, ఆఖరి ఓవర్ దాకా పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఆసియా కప్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌కి 11 ఏళ్ల తర్వాత వచ్చిన తొలి విజయం ఇదే. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే ఆసియా కప్‌లో టీమిండియా ఎదుర్కొన్న మొదటి ఓటమి కూడా ఇదే. 266 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 49.5 ఓవర్లలో 259 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
అయితే, ఈ మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణాన్ని రోహిత్ శర్మ వివరించారు. అంతేకాకుండా, ఈ మ్యాచ్ లో చాలా మంది క్రికెటర్లకు రెస్ట్ ఇచ్చి, వేరే క్రికెటర్లకు రోహిత్ శర్మ ఛాన్స్ ఇచ్చాడు. ఈ విషయంపై కూడా ఆయన స్పందించారు. భవిష్యత్తులో మ్యాచులు, దీర్ఘకాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అందరు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని తాను భావించినట్లు చెప్పారు. అందుకే, బంగ్లాదేశ్ మ్యాచ్ లో మార్పులు చేశామన్నాడు. ఆ విషయంలో తాను కాంప్రమైజ్ కాలేదన్నాడు. వరల్డ్ కప్ ఆడాల్సిన కొంత మంది ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
undefined
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినట్లు చెప్పాడు. కానీ, దురదృష్ట వశాత్తు లక్ష్యం పూర్తి చేయలేకపోయినట్లు చెప్పారు. అయితే, చివరి వరకు పట్టుదలతో ఆడాడని ప్రశంసలు కురిపించాడు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లు చాలా బాగా ఆడారని, వారు విజయం సాధించడానికి అదే కారణమన్నారు.
ఇక, శుక్రవారం జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్‌లో 12 పరుగులు అవసరం అయ్యాయి. మహ్మద్ షమీ, ఆఖరి 3 బంతుల్లో పరుగులేమీ రాబట్టలేకపోయాడు. నాలుగో బంతికి షమీ ఫోర్ రాబట్టడంతో చివరి 2 బంతుల్లో 8 పరుగులు అవసరమయ్యాయి. ఆ తర్వాతి బంతికి రెండో పరుగుకి ప్రయత్నించిన మహ్మద్ షమీ రనౌట్ కావడంతో భారత ఇన్నింగ్స్ 259 పరుగుల వద్ద ముగిసింది.