Asia cup 2022 INDvsPAK: టాస్ గెలిచిన పాకిస్తాన్...

By Chinthakindhi RamuFirst Published Sep 4, 2022, 7:04 PM IST
Highlights

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్... తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..

ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా నేడు సూపర్ 4 రౌండ్‌లో భారత జట్టు, పాకిస్తాన్‌తో తలబడుతోంది. నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. భారత జట్టు మూడు మార్పులతో నేటి మ్యాచ్‌లో బరిలో దిగనుంది.

ఆసియా కప్ 2022 టోర్నీలో ఇరుజట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో పాక్‌పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది భారత జట్టు. అయితే టీమిండియా చేతుల్లో ఓడిన పాకిస్తాన్, ఆ తర్వాతి మ్యాచ్‌లో హంగ్‌ కాంగ్‌పై 155 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది...

భారత జట్టుపై 150+ స్కోరు చేసిన హంగ్ కాంగ్‌ని పాక్ బౌలర్లు, 38 పరుగులకే ఆలౌటగ్ చేసేశారు. పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్‌కి ముందు భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో ఆసియా కప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మొదటి మ్యాచ్‌లో 35 పరుగులు చేసిన జడేజా... రెండు ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు...

అలాగే యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్ జ్వరంతో బాధపడుతుండడంతో నేటి మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు. ఆవేశ్ ఖాన్ స్థానంలో స్పిన్నర్ రవి భిష్ణోయ్‌కి తుది జట్టులో అవకాశం దక్కగా రవీంద్ర జడేజా స్థానంలో ఆల్‌రౌండర్ దీపక్ హుడా తుదిజట్టులోకి వచ్చాడు...

సీనియర్ దినేశ్ కార్తీక్‌కి ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చిన టీమిండియా, అతని స్థానంలో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి తుదిజట్టులో చోటు కల్పించింది. దీపక్ హుడా ఇప్పటిదాకా ఆడిన ఏ మ్యాచ్‌లోనూ టీమిండియా ఓడిపోయింది లేదు. దీంతో నేటి మ్యాచ్‌పై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది...

గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన పాక్ బౌలర్ షానవజ్ దహానీ స్థానంలో మహమ్మద్ హస్నైన్‌కి తుది జట్టులో అవకాశం దక్కింది. 

పాకిస్తాన్ జట్టు: మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజమ్, ఫకార్ జమాన్, కుష్‌దిల్ షా, ఇఫ్తికర్ అహ్మద్, షాదబ్ ఖాన్, అసిఫ్ ఆలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్, నసీం షా

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్

click me!