IND vs PAK: రాసిపెట్టుకో.. అదే రిపీట్ అవుద్ది! పాక్ మీమర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్

Published : Sep 04, 2022, 03:52 PM ISTUpdated : Sep 04, 2022, 03:53 PM IST
IND vs PAK: రాసిపెట్టుకో.. అదే రిపీట్ అవుద్ది! పాక్ మీమర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్

సారాంశం

Asia Cup 2022: ఇండియా-పాక్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు..? అనేదానిమీద ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు క్రికెట్ అభిమానుల మధ్య చర్చోపచర్చలు నడుస్తున్నాయి. తాజాగా  ఇందులో ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరాడు. 

ఆసియా కప్-2022లో భాగంగా నేడు మరోసారి తలపడనున్న దాయాదుల పోరులో విజయమెవరిది..? భారత్ తన ఆధిక్యాన్ని నిలుపుకుంటుందా..? పాకిస్తాన్ గెలిచి రివేంజ్ ప్రతీకారం తీర్చుకుంటుందా..? ఇప్పుడు ఏ ఇద్దరు క్రికెట్ అభిమానులను కదిలించినా ఇదే చర్చ.  అయితే ఈ మ్యాచ్ పై క్రికెట్ ఫ్యాన్సే కాదు..  మాజీ క్రికెటర్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా ఇండియా-పాకిస్తాన్ సూపర్-4 మ్యాచ్ పై టీమిండియా మాజీ క్రికెటర్, స్వింగ్ సుల్తాన్ ఇర్ఫాన్ పఠాన్  తనదైన శైలిలో స్పందించాడు. ఈ మ్యాచ్ లో కూడా  గత  ఆదివారం నాటి ఫలితమే రిపీట్ అవుద్దని కుండబద్దలుకొట్టాడు. 

పాకిస్తాన్ మీమర్ మోమిన్ సాకిబ్ (మారో, ముజే మారో ఫేమ్)  తో సంభాషణ సందర్భంగా  ఇర్ఫాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక-అఫ్గానిస్తాన్ మ్యాచ్ సందర్భంగా  తనను కలిసిన మోమిన్ తో పఠాన్ ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

శ్రీలంక-అఫ్గాన్ మ్యాచ్ లో స్టాండ్స్ లో ఉన్న పఠాన్ ను కలిసిన మోమిన్..‘2006లో మీరు పాకిస్తాన్ మీద హ్యాట్రిక్ తీశారు. ఆదివారం జరుగబోయే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు. ఆ మ్యాచ్ లో ఫలితం ఎలా ఉండబోతుంది..?’అని ప్రశ్నించాడు. దానికి ఇర్ఫాన్ స్పందిస్తూ.. ‘ఆదివారం నాటి ఫలితమే రిపీట్ అవుద్ది...’అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు.  

అప్పుడు మోమిన్.. ‘ఏది రిపీట్..? గతేడాది టీ20 ప్రపంచకప్ లో  దుబాయ్ లో మ్యాచ్ ఫలితమా..?’ అని  అతి తెలివి చూపెట్టాడు. దానికి ఇర్ఫాన్.. ‘అదేదో మీ అదృష్టం బాగుండి ఒక్కసారి జరిగింది. అంతేగానీ ప్రతీసారి జరగదు. టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపే ఫామ్ లో ఉన్నారు..’ అని  మోమిన్ తో పాటు అక్కడున్న పాకిస్తాన్ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.  తర్వాత మోమిన్.. ‘వచ్చే ఆదివారం భారత్-పాక్ మధ్య ఆసియా కప్ ఫైనల్ కోసం చూద్దాం..’ అని ఇర్ఫాన్ తో అనగా  అతడు నవ్వుతూ వెళ్లిపోయాడు. నెట్టింట ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతున్నది. 

 

సూపర్-4లో భాగంగా  భారత్.. పాకిస్తాన్ తో పాటు శ్రీలంక, అఫ్గానిస్తాన్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ దశలో టాప్-1, టాప్-2 జట్లు ఫైనల్ ఆడతాయి. ఫైనల్ లో భారత్-పాకిస్తాన్ పోరు తప్పదని ఫ్యాన్స్ అంతా అంచనావేస్తున్నారు. మరి  ఫైనల్ చేరేదెవరనేది 9న తేలనుంది. భారత్  కోణంలో చూస్తే పాకిస్తాన్ తో పోరు నెగ్గితే ఫైనల్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకున్నట్టే. శ్రీలంక, అప్గానిస్తాన్ లను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. 

 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !