ఒక్కసారి ఏదో లక్కీగా గెలిచేశారు, మళ్లీ మళ్లీ అలా జరగదు... పాక్ క్రికెట్ ఫ్యాన్‌కి ఇర్పాన్ పఠాన్ కౌంటర్...

By Chinthakindhi Ramu  |  First Published Sep 4, 2022, 6:33 PM IST

Asia Cup 2022 India vs Pakistan: లక్కీగా ఓసారి గెలిచేశారు.. మళ్లీ మళ్లీ అదృష్టం కలిసిరాదు... పాకిస్తాన్ ఫేమస్ మీమర్‌తో ఇర్ఫాన్ పఠాన్ కామెంట్...


ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా సూపర్ 4 రౌండ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు రెండోసారి తలబడబోతున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్‌పై గెలిచిన పాకిస్తాన్, ఆసియా కప్ 2022 టోర్నీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో సూపర్ 4 మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది...

దాయాది దేశాలు, ఒకే టోర్నీలో రెండోసారి తలబడుతుండడంతో ఈ మ్యాచ్‌కి బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. మ్యాచ్ ఆరంభానికి 3 గంటల ముందే వేల సంఖ్యలో అభిమానులు ప్రత్యేక్షంగా మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి క్యూ కట్టారు. 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో ‘మారో ముజే మారో...’ కామెంట్లతో సోషల్ మీడియాలో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న పాకిస్తాన్‌ క్రికెట్ ఫ్యాన్ మోమిన్ సాకిబ్... ఇప్పుడు పాక్‌లో క్రికెట్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు...

Latest Videos

మోమిన్ సాకిబ్‌కి వచ్చిన పాపులారిటీతో 2021 వరల్డ్ కప్ సమయంలో అతన్ని స్పోర్ట్స్ యాంకర్‌గా వాడిన పాక్ టీవీ ఛానెళ్లు, ఆసియా కప్ 2022 టోర్నీలోనూ అదే పనిని అప్పగించాయి. తాజాగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి ముందు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌ని కలిసాడు మోమిన్ సాకిబ్...

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Momin Saqib (@mominsaqib)

‘ఇర్పాన్ పఠాన్... మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. 2006 నుంచి మీ ఆటను చూస్తున్నాను. మీరు పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ కూడా తీశారు. మీరు ఇండియాకి దొరికిన బెస్ట్ స్వింగ్ బౌలర్లలో ఒకరు. అయితే ఇర్ఫాన్ భాయ్ సండే రోజు మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు...’ అంటూ ప్రశ్నించాడు మోమిన్ సాకిబ్...

దానికి ఇర్ఫాన్ పఠాన్... ‘హిస్టరీ రిపీట్ అవుద్ది’ అంటూ సమాధానం ఇచ్చాడు. దానికి మోమిన్ సాకిబ్ వెంటనే ‘ఏది గత ఏడాది మ్యాచ్ రిజల్ట్‌యేనా’ అంటూ భారత మాజీ క్రికెటర్‌కి కౌంటర్ ఇవ్వబోయాడు. అయితే ఇర్ఫాన్ పఠాన్... ‘అదేదో ఒక్కసారి అలా లక్కీగా గెలిచేశారు. మళ్లీ మళ్లీ అలా కాదు.. ఇప్పుడు మావోళ్లు మంచి ఫామ్‌లో కూడా ఉన్నారు...’ అంటూ కామెంట్ చేసి మోమిన్ సాకిబ్ నోరు మూయించాడు...

ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన మోమిన్ సాకిబ్... ‘ఇర్ఫాన్ భాయ్... మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఈసారి ఆసియా కప్ మాదే...’ అంటూ కాప్షన్ జోడించాడు.. ఈ పోస్టుపై ఇర్పాన్ పఠాన్ కూడా స్పందించాడు. ‘పోయిన ఆదివారం ఏం జరిగిందో గుర్తుంచుకో... గుడ్ లక్ ఫర్ యువర్ వర్క్’ అంటూ కామెంట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...
 

click me!