IND vs PAK: దుబాయ్‌లో జరుగబోయే ఇండియా-పాక్ క్రికెట్ యుద్ధాన్ని ఇలా చూసేయండి..

By Srinivas MFirst Published Aug 28, 2022, 5:43 PM IST
Highlights

Asia Cup 2022: ఆసియా కప్ - 2022లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ లు  కాసేపట్లో ‘ఢీ’కొనబోతున్నాయి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలంటే.. 
 

క్రీడలలో కొన్ని పోటీలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.  ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచేది భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్. ఇరు దేశాల మధ్య ఉన్న  సరిహద్దు వివాదాలతో  ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్  ఎప్పుడు జరిగినా రసవత్తరంగా సాగుతున్నది. ‘మిగిలిన అన్ని మ్యాచ్‌ల మాదిరే మాకు ఇది కూడా ఒక మ్యాచే..’ అని  ఆటగాళ్లు, విశ్లేషకులు ఎంత సర్ది చెప్పుకున్నా ఇరుదేశాల అభిమానులకు మాత్రం అవన్నీ ఎక్కవు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలలో అయితే ‘వరల్డ్ కప్ నెగ్గకున్నా పర్లేదు.. పాక్ పై మ్యాచ్ గెలిస్తే చాలు’ అనుకునే అభిమానులూ ఉన్నారు. అంతటి క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం  చేయడానికి ‘స్టార్’ సర్వం సిద్ధం చేసింది. 

ఆసియా కప్-2022  మీడియా హక్కులను వచ్చే ఏడాది వరకు దక్కించుకున్న ‘డిస్నీ స్టార్’ సంస్థ ఈ టోర్నీకి  అధికారిక ప్రసారదారు. భారత్ లో ‘స్టార్’ నెట్వర్క్ లోని పలు ఛానెల్స్ లో భారత్-పాక్ మ్యాచ్ ను వీక్షించొచ్చు.  ఆ వివరాలు మీకోసం.. 

మ్యాచ్ సమయం : ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి ప్రారంభం. (టాస్ 7 గంటలకు)

వేదిక : దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్ 

లైవ్ స్ట్రీమింగ్ : భారత్ లో ‘స్టార్’ నెట్వర్క్ లోని స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ తమిళ్ లో వీక్షించే సదుపాయం ఉంది.  స్టార్ తో పాటు దూరదర్శన్ (డీడీ) స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ ను చూడొచ్చు.

 

It's D-Day and the battle lines are drawn! 🤯 DP World pic.twitter.com/NapTkXbH5Z

— Star Sports (@StarSportsIndia)

స్టార్  నెట్వర్క్ తో పాటు ఫోన్లలో చూసేవాళ్లకోసం ‘డిస్నీ హాట్ స్టార్’ లో కూడా ఈ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు. 

పాకిస్తాన్ లో  ఈ మ్యాచ్ పీటీవీ, టెన్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆస్ట్రేలియాలో యప్ టీవీ, యూకేలో స్కై స్పోర్ట్స్ క్రికెట్ లో రానుంది. ఈ మేరకు హిందీ, ఇంగ్లీష్ కామెంటేటర్లు తమదైన వాక్చాతుర్యంతో ఈ మ్యాచ్ ను మరింత రసవత్తరంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. మరింకెందుకు ఆలస్యం. దాయాదుల సమరానికి మీరూ సిద్ధం కండి..!!

 

🤏: How close we are to the ! 🤩

Tweet your questions about with and stand a chance to have them answered by our experts on 📺! | Today, 6 PM | Star Sports Network & Disney+Hotstar pic.twitter.com/QYKVGQj3hI

— Star Sports (@StarSportsIndia)

 

click me!