డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యం మారడంతో ఓటమి తేడా తగ్గింది కానీ లేకుండా టీమిండియాకి 182 పరుగుల తేడాతో భారీ విజయం దక్కి ఉండేది.
ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం తలపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలుండగానే ఈ సిరిస్ ని టీమిండియా సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యం మారడంతో ఓటమి తేడా తగ్గింది కానీ లేకుండా టీమిండియాకి 182 పరుగుల తేడాతో భారీ విజయం దక్కి ఉండేది.
అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు.తొలి వన్డేలో పెద్దగా సత్తా చాటలేకపోయిన అశ్విన్, రెండో వన్డేలో మాత్రం అదరగొట్టేశాడు. ఈ మ్యాచ్ లో 3 వికెట్లతో సత్తాచాటాడు. 7 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్, 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అశ్విన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట వేసుకున్నాడు.
undefined
ప్రత్యర్థి జట్టుపై అత్యధిక అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా అశ్విన్ రికార్డు సాధించాడు. ఆసీస్ పై అశ్విన్ ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లు కలిపి 144 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే కూడా ఆస్ట్రిలియా జట్టుపైనే ఈ ఘనత సాధించడం గమనార్హం.
ఆస్ట్రేలియాపై 142 అంతర్జాతీయ వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్ తో కుంబ్లే ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. అశ్విన్ దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం విశేషం. కుంబ్లే తర్వాత భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(141) ఉన్నాడు.