అర్జున అవార్డు రేసులో మహ్మద్ షమీ..

By Mahesh Rajamoni  |  First Published Dec 14, 2023, 3:53 PM IST

Mohammed Shami: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పేరును అర్జున అవార్డుకు బీసీసీఐ పంపింది. 2023 ప్రపంచకప్‌లో షమీ కేవలం ఏడు మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. 
 


Team India pacer Mohammed Shami: ఇటీవ‌ల ముగిసిన ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో త‌న అద్భుత ప్రదర్శనతో అద‌ర‌గొట్టిన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ప్రత్యేక బహుమతి దక్కే అవకాశం ఉంది. దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు రేసులో ఉన్నాడు. ఈ అవార‌డుకు సంబంధించి ఆయన పేరును ఇప్ప‌టికే సిఫారసు చేశారు. ప్ర‌స్తుతం అన్ని ఫార్మాట్లలో భారత అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లలో షమీ ఒకడు.

ఈ ఏడాది అర్జున అవార్డుకు షమీ పేరును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సిఫారసు చేసింది. ఈ మేరకు బుధవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 33 ఏళ్ల షమీ వన్డే ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించాడు. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది కానీ, భార‌త ప్లేయ‌ర్లు ప్ర‌పంచ క‌ప్ లో త‌మ అద్బుత‌మైన ఆట‌తో అద‌ర‌గొట్టారు. ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా షమీ నిలిచాడు. కేవలం ఏడు మ్యాచ్ ల‌ను ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. తొలి నాలుగు మ్యాచుల్లో షమీకి జట్టులో చోటు దక్కలేదు. అయితే, హార్దిక్ పాండ్యా గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూరం కావ‌డంతో ష‌మీకి జ‌ట్టులో స్థానం క‌ల్పించారు.

Latest Videos

ఈ ఏడాది క్రీడా అవార్డులను నిర్ణయించేందుకు 12 మంది సభ్యులతో కూడిన కమిటీని మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డు ఉన్నాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఏఎం ఖన్విల్కర్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఆమెతో పాటు ఆరుగురు మాజీ అంతర్జాతీయ అథ్లెట్లు కూడా ఈ కమిటీలో ఉన్నారు. హాకీ ప్లేయర్ ధన్ రాజ్ పిళ్లై, మాజీ పాడ్లర్ కమలేష్ మెహతా, మాజీ బాక్సర్ అఖిల్ కుమార్, మహిళా షూటర్, ప్రస్తుత జాతీయ కోచ్ షుమా షిరూర్, మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తృప్తి ముర్గుండే, పవర్ లిఫ్టర్ ఫర్మాన్ పాషా కూడా ఈ ప్యానెల్ లో ఉన్నారు.

కాగా, సౌతాఫ్రికాతో జరగబోయే రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో షమీకి ఆడే అవకాశం దక్కే అవకాశం ఉంది. తొలి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్ జనవరి 3 నుంచి కేప్ టౌన్ లో ప్రారంభం కానుంది.

Yearender 2023: ఈ ఏడాది టాప్-10 టీ20 బ్యాట్స్మన్ ఎవ‌రో తెలుసా..?

click me!