IPL2021:ఇంత ఫాస్ట్ బౌలింగ్ కి ఫైన్ వేయాలి తెలుసా..?

By telugu news teamFirst Published Sep 23, 2021, 2:31 PM IST
Highlights

 సన్ రైజర్స్ జట్టులోని కీలక ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, కేదార్ జాదవ్ వికెట్లను నోర్జే పడగొట్టాడు. ఇక పరుగులు కూడా కేవలం 12 మాత్రమే ఇవ్వడం విశేషం. 

ఐపీఎల్(IPL2021) లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) అదరగొడుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ( Sunrisers Hyderabad) ని చిత్తుగా ఓడించి.. విజయాన్ని అందుకుంంది. అయితే.. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ పేస్ మ్యాన్ అన్రిచ్ నోర్జే (Anrich Nortje) అదరగొట్టాడనే చెప్పాలి. గతంలో కంటే తన ఆటను బాగా మెరుగుపరుచుకున్నాడు.

అన్రిచ్ నోర్జే రెండు వికెట్లు పడగొట్టి.. తమ జట్టు విజయానికి సహఖరించాడు.  కాగా ఈ ఐపీఎల్ మొదటిసారి నోర్జే అదరగొట్డడం విశేషం. ఈ మ్యాచ్ లో పాల్గొనడానికి ముందు నోర్జే దాదాపు ఎనిమిది మ్యాచ్ లు ఎదురు చూడాల్సి వచ్చింది. సన్ రైజర్స్ జట్టులోని కీలక ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, కేదార్ జాదవ్ వికెట్లను నోర్జే పడగొట్టాడు. ఇక పరుగులు కూడా కేవలం 12 మాత్రమే ఇవ్వడం విశేషం. 

అంతేకాకుండా నాలుగు సందర్భాల్లో గంటకు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బంతిని విసరడం విశేషం. 151.71 కిమీ/గం అతని అత్యధికం కావడం గమనార్హం. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో మొత్తం ఐపిఎల్ 2021 సీజన్ లో   ఎనిమిది సార్లు  వేగవంతమైన డెలివరీ రికార్డును అధిగమించాడు.

Over-speeding ka challan kato 🙈🤷‍♂️ https://t.co/6U3p8eOGsZ

— Aakash Chopra (@cricketaakash)

 

కాగా.. నోర్జే బౌలింగ్ ని మెచ్చుకుంటూ ఇండియన్ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంత ఫాస్ట్ బౌలింగ్ ఫైన్ కట్టాలి తెలుసా’ అంటూ ఆయన చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది.  ఇక నోర్జే బౌలింగ్ పై.. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ కూడా ప్రశంసలు  కురిపించడం విశేషం. 

click me!