IPL2021: దేవుడిచ్చిన టాలెంట్ వృథా చేస్తున్నావ్.. సంజుశాంసన్ కి గవాస్కర్ సలహా.!

By telugu news teamFirst Published Sep 23, 2021, 12:52 PM IST
Highlights

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ఐదు బంతుల్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో.. అందరూ సంజూ ఆటతీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. కాగా.. ఇదే విజయమై సీనియర్ క్రికెట్ లెజెండరీ సునీల్ గవాస్కర్ సంజు ఆట తీరుపై స్పందించారు.


దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్  ( ipl2021)14 వ సీజన్ సెకండ్ ఫేస్ క్రికెట్ ప్రియులను అలరిస్తోంది. దీనిలో భాగంగా.. మంగళవారం రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చివరికి విజయం రాజస్థాన్ రాయల్స్ కే దక్కినా.. ఆ క్రెడిట్ మొత్తం కార్తీక్ త్యాగి (kartik Tyagi) ఖాతాలోకే పోయింది. మరీ ముఖ్యంగా.. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ (Sanju Samson) ఆట తీవ్ర నిరాశకు గురిచేయడం గమనార్హం.

సంజు శాంసన్ బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ఐదు బంతుల్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో.. అందరూ సంజూ ఆటతీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. కాగా.. ఇదే విజయమై సీనియర్ క్రికెట్ లెజెండరీ సునీల్ గవాస్కర్ సంజు ఆట తీరుపై స్పందించారు.

సంజు శాంసన్ తనకు దేవుడు ఇచ్చిన సూపర్ టాలెంట్ ని వృథా చేసుకుంటున్నాడని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. శాంసన్..టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్ కావాలంటే.. అతని  షాట్ ఎంపిక పై ఎక్కువగా కసరత్తులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంజు శాంసన్ తన 26ఏళ్ల వయసులో 2015లొ టీమిండియాలో అరంగేట్రం చేశాడు. కానీ.. అప్పటి నంుచి కేవలం ఒక వన్డే, 10 టీ 20 మ్యచుల్లో మాత్రమే ఆడాడు.

అతను ముందుకు దూసుకుపోవాలంటే షాట్ సెలక్షన్ చాలా అవసరమని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు బ్యాటింగ్ ఓపెన్ కూడా చేయలేదన్నారు. కేవలం రెండు, మూడో వికెట్లు తీశాడని గుర్తు చేశారు.  తొలి బంతిని గ్రౌండ్ నుంచి కొట్టాలని సంజు అనుకుంటున్నాడని.. అది అసాధ్యమని గవాస్కర్ పేర్కొన్నారు. సంజుకి చాలా టాలెంట్ ఉందని.. దానిని వృథా చేసుకోవద్దని సూచించాడు. 

click me!