రాజస్థాన్ కు బిగ్ షాక్... మరో కీలక ఆటగాడు జట్టుకు దూరం

Published : May 03, 2019, 05:35 PM IST
రాజస్థాన్ కు బిగ్ షాక్... మరో కీలక ఆటగాడు జట్టుకు దూరం

సారాంశం

ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2019 మూలంగా ఐపిఎల్ జట్లన్ని ఓవర్సిస్ ఆటగాళ్లను మిస్సవుతున్న విషయం తెలిసిందే. అయితే దీని వల్ల అత్యధికంగా నష్టపోతున్న జట్టు రాజస్థాన్ రాయల్స్. ఆ జట్టు ఇప్పటికే జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, ఆర్చర్, టర్నర్ వంటి కీలక ఆటగాళ్ల సేవలను మిస్సవుతూ వరుస ఓటములను చవిచూస్తోంది. ఇప్పుడు కెప్టెన్ స్టీవ్ స్మిత్ సేవలను కూడా ఆ జట్టు కోల్పోతోంది. శనివారం డిల్లీ క్యాపిటల్స్ తో ఆడనున్న చివరి లీగ్ మ్యాచ్ కు స్మిత్ దూరమయ్యాడు. 

ఇతర జట్ల ప్రదర్శనలపై ఆధారపడి అదృష్టం కలిసొస్తే ప్లేఆఫ్ కు చేరుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. అలా జరగాలన్నా డిల్లీతో జరిగే చివరి మ్యాచ్ ను రాయల్స్ జట్టు గెలవాల్సి వుంటుంది. అప్పుడు 13 పాయింట్లతో ప్లేఆఫ్ పై చివరి  ఆశలను సజీవంగా వుంచుకోవచ్చు. ఇలాంటి కీలకమైన సమయంలో రాజస్థాన్ కెప్టెన్ స్మిత్ జట్టుకు దూరమవడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. 

ఇప్పటికే లీగ్ దశలో తడబడుతున్న రాజస్ధాన్ ప్లేఆఫ్ కు చేరుకునే అవకాశాలు చాలా తక్కువగా వున్నాయి. ఒకవేళ ప్లేఆఫ్ కు చేరుకుంటే ఓవర్సీస్ ఆటగాళ్లు లేని ప్రభావం ఆ జట్టుపై పడనుంది.

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు