పొలార్డ్ కు తప్పిన ప్రమాదం...క్రికెట్ మైదానంలో పుట్‌బాల్ స్టైల్ ప్రదర్శించబోయి (వీడియో)

Published : May 03, 2019, 04:35 PM IST
పొలార్డ్ కు తప్పిన ప్రమాదం...క్రికెట్ మైదానంలో పుట్‌బాల్ స్టైల్ ప్రదర్శించబోయి (వీడియో)

సారాంశం

వాంఖడే స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు కిరణ్ పొలార్డ్ ఫెను ప్రమాదం నుండి బయటపడ్డాడు. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ వద్ద బంతిని ఆపడానికి ప్రయత్నిస్తూ పొలార్డ్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వేగంగా వెళుతూ బౌండరీ లైన్ తర్వాత వుండే బారికెడ్లను గుద్దుకుని ప్రమాదకర రీతిలో అవతలికి పడిపోయాడు. అయితే ఈ ప్రమాదంలో అతడికి ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డాడు. 

పొలార్డ్ అద్భుతమైన ఫీల్డర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అతడు మైదానంలో చిరుతలా కదులుతూ పీల్డింగ్ చేస్తుంటాడు. ఇక బౌండరీల వద్ద అతడు సాహసోపేత విన్యాసాలతో క్యాచులు అందుకునే, బౌండరీని అడ్డుకునే తీరు అత్యద్భుతం. ఇలా ప్రతి సీజన్ కనీసం ఒక్కటైన సూపర్ క్యాచ్ ను అందుకోవడాన్ని మనందరం చూస్తుంటాం. అయితే ఈసారి మరితం కొత్తగా బంతిని ఆపడానికి ప్రయత్నించి విఫలమైన పొలార్డ్ ఇలా ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు. 

వాంఖడేలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ వృద్దిమాన్ సాహా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పొలార్డ్ మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. సాహా కొట్టిన ఓ బంతి బౌండరీవైపు దూసుకెళుతుండగా దాన్ని ఆపడానికి పొలార్డ్ వినూత్నంగా ప్రయత్నించాడు. బంతిని వెంటాడిన అతడు బౌండరీ వద్ద పుట్ బాల్ ప్లేయర్ మాదిరిగా కాలితోనే  బంతిని వెనక్కి నెట్టాలనుకున్నాడు. కానీ అది విఫలమై బంతి బౌండరీలైన్ ను తాకడంతో పాటు పొలార్డ్ అదేవేగంలో బారికెడ్లను గుద్దుకుని ఎగిరి అవతలపడ్డాడు. 

అయితే అతడు ఇంకాస్త పక్కన పడివుంటే తీవ్రంగా గాయపడేవాడు. సౌండ్ సిస్టంకు చెందిన భారీ పరికరాలకు కొద్దిగా పక్కన పడటంతో ప్రమాదం తప్పింది. పొలార్డ్ కు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు, యాజమాన్యంతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు