
క్రికెట్ ప్రపంచాన్ని కరోనా భూతం వదిలిపెట్టడం లేదు. అసలే న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు టూర్లను రద్దు చేసుకోవడంతో భారీగా నష్టపోయిన పాకిస్తాన్‌కి విండీస్ జట్టులో వెలుగుచూస్తున్న కరోనా కేసులు మరింత భయాన్ని రేపుతున్నాయి. పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో తాజాగా మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి...
వీటితో కలిసి మొత్తంగా ఆరుగురు ప్లేయర్లు, పాక్ టూర్ నుంచి తప్పుకున్నట్టైంది. డిసెంబర్ 13 నుంచి పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న విండీస్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు జరగాల్సి ఉంది. ఇప్పటికే మొదటి రెండు టీ20 మ్యాచుల్లో పాక్ విజయాలను అందుకుంది.
ఈ మ్యాచులన్నీ కరాచీలోని నేషనల్ స్టేడియంలోనే జరగనున్నాయి. సిరీస్ ఆరంభానికి ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ముగ్గురు సీనియర్ ప్లేయర్లతో పాటు ఓ సహాయక సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. ఆల్‌రౌండర్ రోస్టన్ ఛేజ్, కైల్ మేయర్, ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ కరోనా బారిన పడగా.. తాజాగా షై హోప్, అకీల్ హుస్సేన్, జస్టన్ గ్రీవ్స్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు అసిస్టెంట్ కోచ్ రోడీ ఎస్వీక్, టీమ్ ఫిజిషియన్ డాక్టర్ అక్షాయ్ మాన్‌సింగ్‌లు కరోనా పాజిటివ్‌గా తేలారు...
ఈ కేసులతో కలిపి మొత్తంగా విండీస్ జట్టులో ఆరుగురు ప్లేయర్లు కరోనా బారిన పడగా, పాజిటివ్ కేసుల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఘోరమైన ప్రదర్శన ఇచ్చి, గ్రూప్ స్టేజ్‌లో ఒకే ఒక్క విజయాన్ని అందుకోగలిగింది విండీస్... డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన వెస్టిండీస్, మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో 55 పరుగులకే ఆలౌట్ కావడం, అందర్నీ షాక్‌కి గురి చేసింది...
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 3 పరుగుల తేడాతో దక్కిన ఉత్కంఠ విజయం తప్ప, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక చేతుల్లోనూ ఓడింది వెస్టిండీస్. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గాయపడిన సీనియర్ ఆల్‌రౌండర్, విండీస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్... పాక్ పర్యటనలో పాల్గొనడం లేదు. అతని స్థానంలో యంగ్ ఆల్‌రౌండర్ నికోలస్ పూరన్, విండీస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు...
అలాగే సీనియర్ ఆల్‌రౌండర్ ఆండ్రే రస్పెల్, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ వంటి సీనియర్ ప్లేయర్లు పాక్ టూర్‌లో ఆడడం లేదు. అదీకాకుండా కరోనా బారిన పడిన షై హోప్, మొదటి రెండు టీ20 మ్యాచుల్లో జట్టుతో కలిసి ఆడాడు. తొలి టీ20లో 31 పరుగులు చేసిన హోప్, రెండో టీ20లో 1 పరుగుకే అవుట్ అయ్యాడు...
ఓపెనర్ షై హోప్ మిగిలిన ప్లేయర్లతో కలిసి ఆడడంతో ఈ సిరీస్ సజావుగా జరుగుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది. షెడ్యూల్ ప్రకారం నేటి సాయంత్రం 6:30కి పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆరుగురు ప్లేయర్లు కరోనా కారణంగా జట్టుకి దూరం కావడంతో విండీస్ ఈ టూర్‌ను పూర్తి చేయడానికి మొగ్గు చూపుతుందా? లేదా వాయిదా వేస్తుందా? అనేది తేలాల్సి ఉంది...