ధోనీ నిద్రపోతుంటే ఎయిర్ హోస్టెస్ వీడియో.. నెటిజన్లు సీరియస్..!

Published : Jul 31, 2023, 01:15 PM ISTUpdated : Jul 31, 2023, 01:56 PM IST
 ధోనీ నిద్రపోతుంటే ఎయిర్ హోస్టెస్ వీడియో.. నెటిజన్లు సీరియస్..!

సారాంశం

ఓ ఎయిర్ హోస్టెస్ ధోనీని క్యాప్చర్ చేయాలని అనుకుంది. ఆయన నిద్రపోతుండగా, సీక్రెట్ గా వీడియో తీసుకుంది. ఆ వీడియోని  సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దేశ విదేశాల్లో ఆయనను అభిమానించేవారు ఉన్నారు. అలాంటి ఆయన కనిపిస్తే, ఫోటో, వీడియో తీసుకోవడం  చాలా కామన్. ఓ అమ్మాయి కూడా అలానే చేసింది. ఇదే ఆనందాన్ని సోషల్ మీడియాలో మిస్ ఫైర్ అయ్యింది.

ఇంతకీ మ్యాటరేంటంటే,  ఇటీవల మహేంద్ర సింగ్ ధోనీ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆయన వెంట భార్య సాక్షి కూడా ఉన్నారు. సాక్షి ఏదో పనిలో బిజీగా ఉండగా, ధోనీ నిద్రపోతున్నారు. అయితే, అక్కడే ఉన్న ఓ ఎయిర్ హోస్టెస్ ధోనీని క్యాప్చర్ చేయాలని అనుకుంది. ఆయన నిద్రపోతుండగా, సీక్రెట్ గా వీడియో తీసుకుంది. ఆ వీడియోని  సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

 

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే,  నెటిజన్లు ఈ వీడియో చూసి  ఎయిర్ హోస్టెస్ ని విపరీతంగా తిడుతున్నారు. ధోనీ కనపడితే ఫోటో తీసుకోవాలి అనుకోవడం కామన్. కానీ, అలా నిద్రపోతున్నప్పుడు ప్రైవసీ భంగం చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు.  కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. సెలబ్రెటీలను చూస్తుంటే, ఆ మాత్రం వీడియోలు తీసుకోకుండా ఉండలేరు కదా అని కామెంట్స్ చేస్తుండటం విశేషం.

PREV
click me!

Recommended Stories

IND vs PAK : ఐసీసీ దెబ్బకు దారిలోకి వచ్చిన పాక్.. నవ్వులపాలవుతున్న నఖ్వీ డ్రామా
T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే