రెమిడిసివర్ కోసం భజ్జీ అభ్యర్ధన.. క్షణాల్లో స్పందించిన సోనూసూద్

Siva Kodati |  
Published : May 12, 2021, 10:10 PM IST
రెమిడిసివర్ కోసం భజ్జీ అభ్యర్ధన.. క్షణాల్లో స్పందించిన సోనూసూద్

సారాంశం

కరోనా సమయంలో రియల్ హీరోగా మారిపోయారు సోనూసూద్. ఆపదలో వున్నవారికి నేనున్నాననే భరోసానిస్తూ.. వారి అవసరాలు తీరుస్తున్నారు సోనూ. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారు

కరోనా సమయంలో రియల్ హీరోగా మారిపోయారు సోనూసూద్. ఆపదలో వున్నవారికి నేనున్నాననే భరోసానిస్తూ.. వారి అవసరాలు తీరుస్తున్నారు సోనూ. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారు. ఇటీవల టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా సైతం సోనూసూద్ సాయం అందుకోగా లేటెస్ట్‌గా మరో మాజీ క్రికెటర్‌కు సైతం అడిగిన వెంటనే సాయం చేశాడు సోనూసూద్.

కరోనా మొదటి దశ సమయంలో వలసకార్మికులను సొంత ఊళ్లకు పంపడానికి స్పెషల్‌గా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసి సాయం చేసిన సోనూసూద్.. సెకండ్ వేవ్ సమయంలో బెడ్లు, ఆక్సిజన్, ప్లాస్మా, ఇంజెక్షన్.. ఇలా ప్రతీ విషయంలో సాయం చేస్తూ జేజేలు అందుకుంటున్నారు. 

ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు తెలిసినవారికి ఒకరికి రెమెడిసివర్ ఇంజెక్షన్ కావాలని సోషల్ మీడియాలో అభ్యర్ధించాడు. ఆ వెంటనే అతని ఫాలోవర్ ఒకరు సోనూసూద్‌ను అడగాలంటూ ట్యాగ్ చేశారు.

వెంటనే స్పందించిన సోనూసూద్.. తప్పకుండా సహాయం అందుతుందంటూ భరోసా ఇచ్చేశాడు. కర్ణాటకలో అవసరమైన వ్యక్తులకు ఇంజెక్షన్ అందుతుంది అని చెప్పగా.. హర్బజన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !