కనీసం ప్యాంట్ వేసుకున్నావ్.. దినేష్ కార్తీక్ పై సెటైర్..!

Published : May 12, 2021, 01:23 PM ISTUpdated : May 12, 2021, 01:26 PM IST
కనీసం ప్యాంట్ వేసుకున్నావ్.. దినేష్ కార్తీక్ పై సెటైర్..!

సారాంశం

వ్యాక్సినేటెడ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. కాగా.. దినేష్ షేర్ చేసిన ఫోటో కి  కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు క్రికెటర్ క్రిస్ లెనిన్ సరదాగా స్పందించాడు.‘ కనీసం నువ్వు ప్యాంట్ వేసుకున్నావ్’ అంటూ కామెంట్ వేశాడు.  

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు క్రికెటర్ దినేష్ కార్తీక్... కరోనా తొలి వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. అందరూ వ్యాక్సిన్ బాట పట్టారు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ కోహ్లీ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. తాజాగా దినేష్ కార్తీక్ వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోని  ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వ్యాక్సినేటెడ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. కాగా.. దినేష్ షేర్ చేసిన ఫోటో కి  కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు క్రికెటర్ క్రిస్ లెనిన్ సరదాగా స్పందించాడు.‘ కనీసం నువ్వు ప్యాంట్ వేసుకున్నావ్’ అంటూ కామెంట్ వేశాడు.

కాగా.. ఆ కామెంట్ కి దినేష్ కార్తీక్ కూడా సరదాగా వెంటనే రిప్లై ఇవ్వడం విశేషం. ‘ నేను ఫస్ట్ షార్ట్స్ వేసుకుందామని అనుకున్నాను.. కానీ నేను మాల్దీవుల్లో లేను కదా.. అందుకే ప్యాంట్ వేసుకున్నా’ అంటూ రిప్లై ఇవ్వడం విశేషం. క్రిస్ లెనిన్.. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ కాగా.. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు ప్రవేశం రద్దు చేశారు.

దీంతో ఆ దేశ క్రికెటర్లంతా మల్దావుల్లో ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో.. క్రిస్ లెనిన్.. మాల్దీవుల్లో ఉన్నాడని అలా దినేష్ కార్తీక్ రిప్లై ఇవ్వడం గమనార్హం. వీరికి సంభాషణ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

PREV
click me!

Recommended Stories

Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !
Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు