సన్ రైజర్స్ క్రికెటర్ రషీద్ ఖాన్ తల్లి మృతి: ఎమోషనల్ పోస్ట్...

By Sreeharsha GopaganiFirst Published Jun 19, 2020, 2:27 PM IST
Highlights

రషీద్ ఖాన్ తల్లి మరణించింది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి గురువారంనాడు తుదిశ్వాస విడిచింది. 

ప్రపంచ స్పిన్ బౌలింగ్ సంచలనం, ఆఫ్గనిస్తాన్ వర్ధమాన క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక బౌలర్ రషీద్ ఖాన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. రషీద్ ఖాన్ తల్లి మరణించింది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి గురువారంనాడు తుదిశ్వాస విడిచింది. 

విషాదకరమైన తన తల్లి మరణవార్తను ట్విట్టర్ వేదికగా బయటపెట్టాడు రషీద్ ఖాన్. తన తల్లి మరణ వార్తను అభిమానులతో పంచుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు రషీద్ ఖాన్. 

అమ్మ నువ్వే నా సర్వస్వం. ఇప్పుడు నువ్వు లేవు అనే వార్తను నమ్మలేకపోతున్నాను. నీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అని రాసుకొచ్చాడు. కొద్దిరోజుల కింద రషీద్ ఖాన్ తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని, అందరి ప్రార్థనలు కావాలని కోరాడు. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. 

అంతర్జాతీయ క్రికెట్ లో అతి తక్కువ సమయంలోనే ఈ యువ సంచలనం ఎన్నో రికార్డులను సృష్టించాడు. కొన్ని రోజులకింద ఒక వీడియోను పోస్ట్ చేసి దీన్ని ఏమంటారు అని అభిమానులను అడిగాడు. 

ధోనీ బాదే హెలికాప్టర్ షాట్ వంటిదే రషీద్ ఖాన్ వికెట్ల వెనకకూ బాదుతూ ఆ వీడియో కనిపించాడు. ఆ షాట్ కు సంబంధించిన వీడియోను రషీద్ ఖాన్ షేర్ చేస్తూ ఈ కోత్త షాట్ ను ఏమని పిలుస్తారని, దీన్ని హెలికాప్టర్ షాట్ అంటారా, లేదా అని అభిమానులను అడిగాడు. దీన్ని హెలికాప్టర్ షాట్ అంటారా, నేను అలాగే అనుకుంటున్నా అనే శీర్షికను పెట్టాడు. రషీద్ ఖాన్ వీడియోపై అతని జట్టు సహచరుడు హమీద్ హసన్ స్పందించాడు. దాన్ని నింజా కట్ అంటారని వ్యాఖ్యానించాడు. 

రషీద్ ఖాన్ వీడియోను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచేజీ సన్ రైజర్స్ హైదరాబాదు ట్విట్టర్ లో షేర్ చేసింది. రషీద్ ఖాన్ చివరగా ఫిబ్రవరి 1వ తేీదన ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరుఫున ఆడాడు. రషీద్ ఖాన్ షేర్ చేసిన వీడియో ఎప్పటిదనేది తెలియడం లేదు. 

ధోనీ కొట్టే సంప్రదాయబద్దమైన హెలికాప్టర్ షాట్ సాధారణం లెగ్ సైడ్ మీడ్ వికెట్, లాంగ్ ఆర్ రీజియన్ లోకి వెళ్తుంది. రషీద్ షాట్ మాత్రం థర్ మ్యాన్ ఫెన్స్ దిశగా వెళ్లింది. దాంతో రషీద్ ఖాన్ కొట్టిన షాట్ ను చాలా మంది రివర్స్ హెలికాప్టర్ షాట్ అన్నారు. 

click me!