కరోనా కష్టాలను వెల్లడించిన లెజెండ్ క్రికెటర్ షేన్ వార్న్.. వెంటిలేటర్‌పైనా చికిత్స తీసుకున్నారు..

By telugu teamFirst Published Sep 24, 2021, 6:11 PM IST
Highlights

ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ కరోనాపై తాను చేసిన పోరాటాన్ని వెల్లడించారు. తొలుత తీవ్ర తలనొప్పితో బాధపడ్డ తాను, కొన్ని రోజులపాటు రుచిని కోల్పోయారని వివరించారు. ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి వెంటిలేటర్‌పైనా చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

ఆస్ట్రేలియా(Australia) లెజెండరీ బౌలర్ షేన్ వార్న్(Shane warne) ఇటీవలే కరోనా(Coronavirus) బారినపడ్డారు. ఆగస్టులో కరోనా సోకిన తర్వాత ఆయన ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. తాను రెండు డోసుల టీకా(Vaccine) తీసుకున్నా కరోనా సోకిందని చెప్పారు. ఈ మహమ్మారితో పోరాడుతూ వెంటిలేటర్(Ventilator) మీదకూ వెళ్లాల్సి వచ్చిందని వెల్లడించారు. తల బద్ధలయ్యేలా నొప్పి వచ్చిందని తెలిపారు.

కరోనా పాజిటివ్ తేలిన తొలి రెండు మూడు రోజుల్లో తల బద్ధలవుతుందా? అనేలా నొప్పి వచ్చిందని షేన్ వార్న్ తెలిపారు. తర్వాత కొన్నాళ్లకు దేహమంతా వణకడం ప్రారంభమైందని చెప్పారు. ఫ్లూ సోకినప్పటిలాగే చెమట కూడా పట్టిందని వివరించారు. కన్ని రోజులపాటు రుచి కోల్పోయారని, కానీ నాలుగైదు రోజుల తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చారని తెలిపారు. ఎట్టకేలకు తాను కరోనా నుంచి బయటపడ్డారని వివరించారు. తాను అప్పటికే కరోనా వైరస్ రెండు డోసుల టీకా తీసుకున్నారని, తర్వాత వైరస్ కూడా సోకిందని తెలిపారు. కాబట్టి, ఇప్పుడు అబ్జల్యూట్ ఫైన్ అని చెప్పారు.

కరోనాతో పోరాడుతున్న సమయంలో తాను వెంటిలేటర్‌పైనా చికిత్స పొందాల్సి వచ్చిందని వెల్లడించారు. కానీ, అది ఎమర్జెన్సీ వెంటిలేటర్ కాదని తెలిపారు. తనకు శ్వాస సంబంధ సమస్యలు రాలేదని, అందుకే ఎమర్జెన్సీ వెంటిలేటర్‌పై చికిత్స తీసుకోవాల్సిన అవసరం రాలేదని వివరించారు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉన్నదని, ఇప్పుడు పరుగెత్తే సామర్థ్యమూ ఉన్నదని తెలిపారు. టీకా తీసుకోవడం స్వచ్ఛంద నిర్ణయమేనని, కానీ, అందరూ టీకా తీసుకుంటే మళ్లీ సాధారణ పరిస్థితులు చూసే అవకాశముంటుందని వివరించారు.

click me!