అర్జున్ టెండుల్కర్ కి సిస్టర్ సారా స్పెషల్ బర్త్ డే విషెస్..!

By telugu news teamFirst Published Sep 24, 2021, 3:00 PM IST
Highlights

కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ శుభమాన్ గిల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చిన సారా టెండూల్కర్, తన తమ్ముడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అర్జున్ చిన్నతనంలోని కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.


ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ , భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ శుక్రవారం (సెప్టెంబర్ 24) 22 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ముంబై ఆల్‌రౌండర్ ప్రస్తుతం ఐపీఎల్ లో భాగంగా  యూఏఈలో ఉన్నాడు.  అతని తండ్రి సచిన్  అక్కడ ప్రస్తుతం మెంటార్‌గా ఉన్నారు. కాగా.. ఈ బర్త్ డే బాయ్ కి  అక్క సారా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా  తనదైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ శుభమాన్ గిల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చిన సారా టెండూల్కర్, తన తమ్ముడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అర్జున్ చిన్నతనంలోని కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. "నా అభిమాన వ్యక్తికి 22 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు"  "లవ్ యు బిగ్ మచ్" అనే రెండు క్యాప్షన్లతో సారా ఈ ఫోటోలను షేర్ చేశారు.

ఇదిలా ఉండగా..  ఐపీఎల్ 2021 వేలంలో అర్జున్ టెండుల్కర్ ని ముంబయి ఇండియన్స్ జట్టు రూ.20లక్షలకు  కొనుగోలు చేసింది. కాగా.. సచిన్ టెండుల్కర్ ఇటీవల యూఏఈ లో ఓ బీచ్ వద్ద తన కొడుకు అర్జున్ టెండుల్కర్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. దానికి కాప్షన్ గా మై సన్ షైన్ అంటూ పెట్టారు.  

ఆ ఫోటోలో సచిన్ పుసుపు రంగు టీషర్ట్ ధరించగా.. అర్జున్ రెడ్ కలర్ స్లీవ్స్ టీ షర్ట్ ధరించడం విశేషం.ఈ ఫోటోలో బ్యాగ్రౌండ్ లో సముద్రం కనపడుతోంది.

click me!