కేన్ విలియంసన్ మరో సెంచరీ... టాప్ ర్యాంకు మరింత పదిలం...2021లో మొట్టమొదటి...

Published : Jan 04, 2021, 11:29 AM IST
కేన్ విలియంసన్ మరో సెంచరీ... టాప్ ర్యాంకు మరింత పదిలం...2021లో మొట్టమొదటి...

సారాంశం

టెస్టుల్లో కేన్ విలియంసన్‌కి ఇది 24వ సెంచరీ...  హెడ్రీ నికోలస్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 215 పరుగుల అజేయ భాగస్వామ్యం.. టెస్టుల్లో తన టాప్ ర్యాంకును మరింత పదిలం చేసుకున్న కేన్ మామ...  

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ బీభత్సమైన ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. టెస్టుల్లో వరుసగా మూడో సెంచరీ నమోదుచేసిన కేన్ విలియంసన్, టెస్టుల్లో తన టాప్ ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అజేయ శతకం బాదాడు కేన్ విలియంసన్.

తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. ఈ దశలో హెడ్రీ నికోలస్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 215 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు కేన్ విలియంసన్. టెస్టుల్లో కేన్ విలియంసన్‌కి ఇది 24వ సెంచరీ. 2020లో చివరి సెంచరీ బాదిన కేన్ విలియంసన్, 2021లో మొదటి సెంచరీ నమోదుచేయడం విశేషం.

టెస్టుల్లో అత్యధిక 50+ స్కోర్లు నమోదుచేసిన న్యూజిలాండ్ ప్లేయర్‌గా స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ రికార్డును అధిగమించాడు కేన్ విలియంసన్. రెండో రోజు ఆట ముగిసేసమయానికి 3 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది కివీస్. కేన్ విలియంసన్ 175 బంతుల్లో 16 ఫోర్లతో 112 పరుగులు, హెన్రో నికోలస్ 186 బంతుల్లో 8 ఫోర్లతో 89 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 297 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పాక్ స్కోరుకి 11 పరుగుల దూరంలో ఉంది ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు.

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?