‘తిరిగి ఇచ్చేయాలిగా...’ ఇండియాలోని చిన్నారులకు ఏబీ డివిల్లియర్స్ చేయూత...

By Chinthakindhi RamuFirst Published Aug 21, 2022, 11:12 AM IST
Highlights

Make A Difference - MAD అనే భారత ఎన్జీవోతో చేతులు కలిపిన ఏబీ డివిల్లియర్స్...  ఇద్దరికి మెంటర్‌గా మారిన సౌతాఫ్రికా మాజీ క్రికెటర్... 

ఇండియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న ఫారిన్ క్రికెటర్లలో ఏబీ డివిల్లియర్స్ ఒకడు.ఈ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడడం ద్వారా భారత అభిమానులకు మరింత చేరువయ్యాడు... విరాట్ కోహ్లీని అభిమానించేవారిలో చాలామంది, అతని ఆత్మీయ మిత్రుడైన ఏబీ డివిల్లియర్స్‌ని కూడా అభిమానిస్తారు...

ఇంతటి అభిమానాన్ని చురగొన్న ఏబీ డివిల్లియర్స్, భారత్‌కి తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. భారత్‌లోని పేద పిల్లలకు చేయూతనిచ్చేందుకు ‘మేక్ ఏ డిఫరెన్స్’ (Make A Difference - MAD) అనే భారత ఎన్జీఓతో చేతులు కలిపాడు ఏబీ డివిల్లియర్స్...

దరిద్య్ర రేఖకు దిగువన ఉన్న పిల్లల్లో ఉన్న టాలెంట్‌ని గుర్తించి, వారు కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు అవసరమైన గైడెన్స్, సదుపాయాల కల్పనకు ఈ ఎన్జీఓ సహాయపడుతుంది. సౌతాఫ్రికా జట్టుకి మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన ఏబీ డివిల్లియర్స్, ‘MAD’ ఎన్జీఓతో చేతులు కలిపి, వలెంటీర్‌గా మారాడు. 

10 ఏళ్ల వయసున్న చిన్నారులను అక్కున చేర్చుకుని, వాళ్లు 28 ఏళ్లు వచ్చేవరకూ కెరీర్‌లో సెటిల్ అయ్యేలా కావాల్సిన మార్గనిర్దేశం, సంరక్షణ, పౌష్టికాహార కల్పన వంటి సౌకర్యాలను సమకూరుస్తుంది ఈ సేవా సంస్థ...

‘ఇండియా ఇన్నేళ్లుగా నాకు ఎంతో చేసింది. ఇండియా నుంచి అమితమైన ప్రేమ, ఆదరణ పొందాను. ఐపీఎల్ వల్ల ఆర్థికంగా కూడా లాభపడ్డాను. చాలారోజులుగా భారత్‌కి నేను తిరిగి ఏ విధంగా సాయపడగలననే విషయంపై ఆలోచిస్తూ వచ్చాను. MADతో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థలోని ఇద్దరు పిల్లలకు మెంటర్‌గా వ్యవహరించబోతున్నాను. 

ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆర్థిక కష్టాలను ఫేస్ చేస్తున్న చిన్నారులకు ఈ సంస్థ ఎంతగానో సాయం చేస్తోంది. వాళ్లు దరిద్ర్య రేఖ నుంచి బయటపడేంత వరకూ అండగా నిలుస్తోంది. వీళ్లు చేస్తున్న పని వెలకట్టలేనిది..’ అంటూ చెప్పుకొచ్చాడు ఏబీ డివిల్లియర్స్...

ఏబీ డివిల్లియర్స్ మెంటర్‌గా వ్యవహరిస్తున్న ఇద్దరిలో ఒకడు లక్నోకి చెందిన అయాన్. 17 ఏళ్ల ఆరు నెలల వయసున్న అయాన్, స్కూల్‌ విద్యను పూర్తి చేశాడు. అండర్ 19 క్రికెటర్‌గా రాణించాలని ఆశపడుతున్న అయాన్‌కి కావాల్సిన గైడెన్స్‌ ఇస్తూ మెంటర్‌గా మారాడు ‘మిస్టర్ 360 డిగ్రీస్’ ఏబీ డివిల్లియర్స్. మరొకరు 21 ఏళ్ల అనిత. బెంగళూరులో జర్నలిజం చదువుతున్న అనిత, జర్నలిస్టుగా కెరీర్ మొదలెట్టాలని చూస్తోంది. ఆమెకు మెంటర్‌గా మారిన ఏబీ డివిల్లియర్స్, తన బాగోగుల బాధ్యతను తీసుకున్నాడు.. 

ఎక్కడో సౌతాఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చి ‘శ్రీమంతుడు’ థీమ్‌తో ‘తిరిగి ఇచ్చేయాలని’ నిర్ణయం తీసుకున్న ఏబీ డివిల్లియర్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని, వందల కోట్లు ఆర్జించిన మన క్రికెటర్లు ఎంతో కొంత తిరిగి ఇస్తే బాగుంటుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

click me!