టీ20 వరల్డ్ కప్‌ 2022లో తొలి హ్యాట్రిక్... లంకపై చెన్నై చిన్నోడు కార్తీక్ మెయ్యప్పన్ మ్యాజిక్...

By Chinthakindhi Ramu  |  First Published Oct 18, 2022, 3:25 PM IST

T20 World cup 2022: శ్రీలంకపై హ్యాట్రిక్ తీసిన కార్తీక్ మెయ్యప్పన్... యూఏఈ ముందు ఓ మోస్తరు స్కోరు పెట్టిన శ్రీలంక...


ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మొట్టమొదటి హ్యాట్రిక్ నమోదైంది. యూఏఈ తరుపున ఆడుతున్న భారతీయుడు కార్తీక్ మెయ్యప్పన్, శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో మూడ బంతుల్లో మూడు వికెట్లు తీసి.. అదరగొట్టాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన  శ్రీలంక జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది...

కుశాల్ మెండిస్ 13 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి ఆర్యన్ లక్రా బౌలింగ్‌లో అవుట్ కాగా రెండో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ధనంజయ డి సిల్వ 21 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. 8 బంతుల్లో 5 పరుగులు చేసిన భనుక రాజపక్షను అవుట్ చేసిన కార్తీక్ మెయ్యప్పన్, ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు వరుస వికెట్లు తీశాడు...

Latest Videos

ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో భనుక రాజపక్ష అవుటైన తర్వాతి బంతికి చరిత్ అసలంక క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా లంక కెప్టెన్ ధస్సున్ శనక‌, మెయ్యప్పన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 పరుగులు చేసిన వానిందు హసరంగ కూడా అఫ్జల్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 14.4 ఓవర్లు ముగిసే సమయానికి 117/2 వద్ద పటిష్టమైన స్థితిలో కనిపించిన శ్రీలంక 6 బంతుల తర్వాత 120/6 స్థితికి చేరుకుంది...

పథుమ్ నిశ్శంక 60 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసి అవుట్ కాగా ఛమీర కరుణరత్నే 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆఖరి 5 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే చేసిన లంక, 3 వికెట్లు కోల్పోయింది.

4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి కార్తీక్ మెయ్యప్పన్, 3 వికెట్లు తీశాడు. టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు కార్తీక్ మెయ్యప్పన్. 2007 టీ20 వరల్డ్ కప్‌లో బ్రెట్ లీ, బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ తీయగా గత ఏడాది మూడు హ్యాట్రిక్స్ నమోదయ్యాయి. నెదర్లాండ్‌పై కుర్టీస్ కాంపర్, 

తమిళనాడులోని చెన్నైలో 2000, అక్టోబర్ 8న జన్మించిన కార్తీక్ మెయ్యప్పన్, 2012లో కుటుంబంతో సహా దుబాయ్‌లో సెటిల్ అయ్యాడు... 2020లో యూఏఈ తరుపున అండర్19 వరల్డ్ కప్ ఆడాడు. 

click me!