పొట్టి ప్రపంచకప్‌లో ఆసక్తికర విషయాలు.. చెరిగిపోని రికార్డులు ఇవే..

By Srinivas M  |  First Published Oct 18, 2022, 3:06 PM IST

T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్  ప్రస్తుతం క్వాలిఫై రౌండ్ తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్ లు కూడా జరుగుతున్నాయి. మరో  మూడు రోజుల్లో ఇవి కూడా ముగుస్తాయి. ఆ తర్వాత  సూపర్-12 మొదలవుతుంది. 


క్రికెట్ అంటే పడిచచ్చే  అభిమానులు ఉన్న దేశాలలో ఆస్ట్రేలియా ఒకటి. ఆ దేశ జాతీయ క్రీడ కూడా  క్రికెటే కావడం గమనార్హం. అటువంటిది  ఆ దేశంలోనే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీ జరిగితే  ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కంగారూల ఆనందాన్ని డబుల్ చేస్తూ రెండ్రోజుల క్రితమే టీ20 ప్రపంచకప్ అట్టహాసంగా మొదలైంది.  ప్రస్తుతం  అర్హత మ్యాచ్ లు జరుగుతుండగా 21 నుంచి అసలు సమరం మొదలుకానుంది.  ఈ నేపథ్యంలో  టీ20 ప్రపంచకప్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఇక్కడ చూద్దాం. 

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న పొట్టి ప్రపంచకప్ 8వ ఎడిషన్. ఈ 8 సార్లలో ఒక్కసారి కూడా టోర్నీకి ఆతిథ్యమిచ్చిన దేశం కప్ కొట్టలేదు. మరి ఈ రికార్డును డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియన్లు తిరగరాస్తారా..?  అనేది త్వరలోనే తేలనుంది. 

Latest Videos

- ఇప్పటివరకు 8 ఎడిషన్లు జరగగా  రెండు సార్లు ప్రపంచకప్ నెగ్గిన ఏకైక జట్టు వెస్టిండీస్.. కరేబియన్లు 2012, 2016లో ఈ మెగా టోర్నీ నెగ్గారు. కానీ   తాజా ప్రపంచకప్ లో మాత్రం విండీస్ క్వాలిఫై రౌండ్ లో ఉంది. ఇప్పటికే ఆ జట్టు స్కాట్లాండ్ తో ఓడింది. మరో మ్యాచ్ ఓడితే గోవిందా..
- గతంలో ముగిసిన ఏడు ప్రపంచకప్ లలో పాల్గొన్న ఆటగాళ్లు : రోహిత్ శర్మ, క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, షకిబ్ అల్ హసన్, మహ్మదుల్లా, ముష్పీకర్ రహీం. వీరిలో 8వ ప్రపంచకప్ ఆడుతున్న ఆటగాళ్లు రోహిత్, షకిబ్ మాత్రమే. 
- ఇప్పటివరకు మూడు సార్లు  ఫైనల్ చేరిన జట్టు శ్రీలంక.. (2009, 2012, 2014) 
- ఫాస్టెస్ట్ ఫిఫ్టీ : యువరాజ్ సింగ్ (12 బంతుల్లోనే..  2007లో ఇంగ్లాండ్ పై) 
- ఫాస్టెస్ట్ హండ్రెడ్ : క్రిస్ గేల్ (2016లో ఇంగ్లాండ్ పై గేల్ 48 బంతుల్లోనే సెంచరీ చేశాడు) 
- టీ20 ప్రపంచకప్ లో రెండు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు గేల్ మాత్రమే.. (2007 లో సౌతాఫ్రికా మీద 57 బంతుల్లో ఒకటి.. ఇంగ్లాండ్ పై 2016లో చేసినదొకటి) 

 

Who will join this elusive list of teams at 2022? 🤔 pic.twitter.com/89imaivXYP

— T20 World Cup (@T20WorldCup)

- టీ20 ప్రపంచకప్ టోర్నీలలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు శ్రీలంకకు చెందిన మహేళ జయవర్దెనే.. (31 మ్యాచ్ లలో 1,016 పరుగులు) 
- సింగిల్ ఎడిషన్ లో  అత్యధిక పరుగులు : విరాట్ కోహ్లీ (ఆరు మ్యాచ్ లలో 319 పరుగులు - 2014) 
- అత్యధిక వికెట్లు : బంగ్లాదేశ్ సారథి షకిబ్ అల్ హసన్ - 31 మ్యాచ్ లలో 41 వికెట్లు 
- సింగిల్ ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ : వనిందు హసరంగ (2021లో 18 వికెట్లు) 
- ఎంఎస్ ధోని :  మోస్ట్ డిస్మిసల్స్ (21 క్యాచ్ లు, 11 స్టంపింగ్స్) 
- జట్టుగా అత్యధిక వ్యక్తిగత స్కోరు : 260-6 (శ్రీలంక కెన్యా మీద చేసింది) 

 

Selfie time 😁🤳 pic.twitter.com/gHTgKnlS48

— T20 World Cup (@T20WorldCup)

- అత్యల్ప స్కోరు: 39 ఆలౌట్ (నమీబియా.. 2014లో శ్రీలంక బౌలింగ్ కు కుదేలైంది) 
- ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు : క్రిస్ గేల్ (11 - ఇంగ్లాండ్ మీద), ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు (63) కూడా గేల్  పేరు మీదే ఉంది. 
- ఫీల్డర్లలో అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాడు : ఏబీ డివిలియర్స్ (23 క్యాచ్ లు) 

click me!