44 ఏళ్ల కోరిక తీర్చి, జీడీపీని పెంచింది: ఇంగ్లాండ్‌కు మేలు చేసిన 2019 వన్డే ప్రపంచకప్

Siva Kodati |  
Published : Mar 04, 2020, 06:51 PM IST
44 ఏళ్ల కోరిక తీర్చి, జీడీపీని పెంచింది: ఇంగ్లాండ్‌కు మేలు చేసిన 2019 వన్డే ప్రపంచకప్

సారాంశం

క్రికెట్ పుట్టింది ఎక్కడ అంటే టక్కున వచ్చే సమాధానం ఇంగ్లాండ్ . కానీ ఆ దేశం వన్డే ప్రపంచకప్‌ను ముద్దడటానికి 40 ఏళ్లకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది. 

క్రికెట్ పుట్టింది ఎక్కడ అంటే టక్కున వచ్చే సమాధానం ఇంగ్లాండ్ . కానీ ఆ దేశం వన్డే ప్రపంచకప్‌ను ముద్దడటానికి 40 ఏళ్లకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది. 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ను సాధించిన ఇంగ్లీష్ సేన అభిమానుల చిరకాల కోరికను నెరవేర్చింది.

చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమం కావడంతో అత్యధిక బౌండరీల ద్వారా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. అభిమానుల కోరికను తీర్చడంతో పాటు బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థకు 2019 ప్రపంచకప్ 350 మిలియన్ పౌండ్ల కన్నా ఎక్కువ మొత్తాన్ని అందించింది.

Also Read:వెంకటేశ్ ప్రసాద్‌కు నిరాశ, బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా సునీల్ జోషీ

వివిధ దేశాల నుంచి వచ్చిన క్రికెట్ అభిమానులు మ్యాచ్‌లు జరిగే నగరాల్లో బస చేయడం ద్వారా సుమారు 46.6 మిలియన్ పౌండ్ల ఆదాయం సమకూరింది. ఇందులో 6,50,000 మంది బ్రిటీష్ పౌరులు కాగా.. 1,28,385 మంది విదేశీ అభిమానులు.

ఇక సెమీ ఫైనళ్లు జరిగిన మాంచెస్టర్, బర్మింగ్ హామ్‌లో వరుసగా 36.3, 29.7 మిలియన్ పౌండ్ల ఆదాయం సమకూరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మెగాటోర్నీని వివిధ దేశాల్లోని 160 కోట్ల మంది వీక్షించారు.

Also Read:ఐపిఎల్ ఫ్రాంచైజీలకు చేదు వార్త: ప్రైజ్ మనీలో సగానికి సగం కోత

డిజిటల్ వీడియో కంటెంట్‌ను 460 కోట్ల మంది ఇంటర్నెట్‌లో చూశారు. మొత్తం మీద లండన్ ఆర్ధిక వ్యవస్థపై ఈ ప్రపంచకప్ భారీగానే ప్రభావం చూపి, బ్రిటన్ జీడీపీ పెరుగుదలకు ఉపయోగపడటంతో ఐసీసీ సంతోషం వ్యక్తం చేసింది. 

PREV
click me!

Recommended Stories

సన్‌రైజర్స్ ప్లానింగ్ అదిరిందిగా.. ఈ ఆటగాళ్లను అస్సలు ఊహించలేరు.!
ముంబై టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు.? రూ. 2.75 కోట్లతో అంబానీ ఏం చేస్తారబ్బా