ఐపిఎల్ ఫ్రాంచైజీలకు చేదు వార్త: ప్రైజ్ మనీలో సగానికి సగం కోత

By telugu team  |  First Published Mar 4, 2020, 5:17 PM IST

పొదుపు చర్యల్లో భాగంగా బీసీసీఐ ఐపీఎల్ చాంపియన్స్ కు ఇచ్చే నగదు బహుమతిలో సగానికి సగం కోత పెట్టింది. విజేతగా నిలిచే ఫ్రాంచేజీకి గతంలో రూ. 20 కోట్లు వచ్చేవి. ఐపిఎల్ 2020 విజేతకు రూ.10 కోట్లు మాత్రమే వస్తాయి.


ముంబై: బీసీసీఐ ఖర్చులను తగ్గించుకునే చర్యలను చేపట్టిన నేపథ్యంలో ఐపీఎల్ 2020 చాంపియన్స్ ప్రైజ్ మనీలో సగానికి సగం కోత పడనుంది. 2019తో పోలిస్తే ప్రైజ్ మనీని సగం తగ్గించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ఐపిఎల్ ఫ్రాంచేజీలకు సర్క్యులర్ పంపించింది. 

ఐపిఎల్ చాంపియన్స్ రూ.20 కోట్లకు బదులు రూ.10 కోట్లు మాత్రమే పొందుతారు. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగగా నగదు బహుమతులను సవరించినట్లు బీసీసీఐ తన నోటిఫికేషన్ లో తెలిపింది. ఛాంపియన్స్ రూ.20 కోట్లకు బదులు రూ.10 కోట్లు పొందుతారు. రన్నర్స్ అప్ ఫ్రాంచేజీ ఇంతకు ముందు 12.5 కోట్ల బహుమతి పొందేది. ఈ ఏడాది పోటీల్లో రూ.6.25 కోట్లు మాత్రమే పొందుతుంది. 

Latest Videos

Also Read: ఐపిఎల్ పై కరోనా వైరస్ ఎఫెక్ట్: సౌరవ్ గంగూలీ వివరణ ఇదీ...

క్వాలిఫయర్స్ లో ఓటమి పాలైన రెండు జట్లు 4.375 కోట్ల రూపాయలు పొందుతాయి. ఫ్రాంచేజీలు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నాయని, ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వాటికి స్పాన్సర్ షిప్ వంటి పలు మార్గాలున్నాయని, అందువల్ల నగదు బహుమతిపై తాము నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ వర్గాలంటున్నాయి.

ఐపిఎల్ ఆటలకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్ర సంఘాలు ప్రతి ఆటకు కోటి రూపాయలచొప్పున పొందుతాయి. ఇందులో బీసీసీఐ రూ. 50 లక్షల చొప్పున ఇస్తుంది. 

Also Read: నేను కొట్టింది హెలికాప్టర్ షాటేనా: రషీద్ ఖాన్ వీడియో వైరల్

బీసీసీఐ ఉద్యోగుల విమాన ప్రయాణాల విషయంలో కూడా పొదుపు చర్యలు తీసుకున్నారు. ప్రయాణ సమయం 8 గంటల లోపల ఉన్న ఆసియా దేశాలకు చేసే ప్రయాణాలకు బీసీసీఐ ఉద్యోగులను బిజినెస్ క్లాస్ విమానాలను వాడకూడదనే నిబంధన పెట్టారు.

click me!