ధోనీ భవిష్యత్తుపై యూవీ కామెంట్... గ్రేట్ సెలక్టర్లు ఉన్నారుగా...

By telugu teamFirst Published Nov 5, 2019, 11:53 AM IST
Highlights

ఈ మాజీ ఆల్ రౌండర్ ఇటీవల మీడియా కంటికి చిక్కగా.. వెంటనే ధోనీ భవిష్యత్తు ఏమౌతుందనే ప్రశ్నలు గుప్పించారు. కాగా... తనకు తెలీదంటూనే సెలక్టర్లపై కౌంటర్లు వేశాడు యువరాజ్ సింగ్.

సిక్సర్ల వీరుడు యువరాజ్... 2019 జూన్ లో అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికారు. కాగా.. ఐపీఎల్ లాంటి మ్యాచుల్లో మాత్రం ఆడుతున్నాడు. కాగా... తాజాగా... యువరాజ్ సింగ్.... టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... భవిష్యత్తు పై షాకింగ్ కామెంట్స్ చేశారు.  2019 ప్రపంచకప్ తర్వాత.. ధోనీ ఇంత వరకు మైదానంలో అడుగుపెట్టింది లేదు. 

దీంతో... ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే... దీనిపై ఇప్పటి వరకు ఒక్కరు కూడా నోరు ఎత్తలేదు. కాగా.. వెస్టిండీస్ తో వరస సిరీస్ లకు ధోనీనేకావాలని బ్రేక్ తీసుకొని రెండు నెలల పాటు ఆర్మీకీ సేవలు అందించాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ తో వరస సిరీస్ లు ప్రారంభం కాగా... దానికి సెలక్టర్లు అసలు ధోనీని ఎంపిక చేయలేదు. దీంతో.. ధోనీని కావాలనే దూరం పెడుతున్నారనే వార్తలు మొదలయ్యాయి.

అయితే....తాజాగా.. ఈ విషయంపై యువరాజ్ సింగ్ స్పందించారు. ఈ మాజీ ఆల్ రౌండర్ ఇటీవల మీడియా కంటికి చిక్కగా.. వెంటనే ధోనీ భవిష్యత్తు ఏమౌతుందనే ప్రశ్నలు గుప్పించారు. కాగా... తనకు తెలీదంటూనే సెలక్టర్లపై కౌంటర్లు వేశాడు యువరాజ్ సింగ్.

‘‘ నాకు తెలీదు బాస్, మీరు అడగాల్సింది నన్ను కాదు... గ్రేట్ సెలక్టర్లు ఉన్నారు కదా వాళ్లని అడగండి. సెలక్టర్లను కలిసినప్పుడు వాళ్లనే అడగండి. అది వాళ్ల చేతిలో ఉంది. నా చేతిలో కాదు.’’

AlsoReadక్రిస్ గేల్ కి చేదు అనుభవం... విమానం ఎక్కనివ్వకుండా......

అనంతరం సెలక్టర్ల కమిటీ గురించి మాట్లాడుతూ.... మంచి సెలక్టర్ల అవసరం కచ్చితంగా ఉందన్నారు. సెలక్టర్ల పని అంత సులభమైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక 15మందిని సెలక్ట్ చేస్తే... మిగిలిన మరో 15 మందితోనూ మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ల ఉద్యోగం చాలా కష్టమైనది. కానీ.. మోడ్రన్ డే క్రికెట్ కి మాత్రం వాళ్లు సరైన టీమ్ ని ఎంపిక చేస్తున్నట్లు తనకు అనిపించడం లేదని... ఇప్పుడు ఎంపిక చేస్తున్న టీం అప్ టూ మార్క్ లేదని తనకు అనిపిస్తోందని.. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే అని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్  ఎదుర్కొన్న సందర్భాన్ని తీసుకువచ్చారు. మ్యాక్స్ వెల్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడని అతనికి ఆస్త్రేలియా క్రికెట్ విశ్రాంతి ఇచ్చింది. అతను కోలుకున్నాక మళ్లీ తీసుకుంటామని కూడా చెప్పారు.

AlsoRead హ్యాపీ బర్త్ డే కోహ్లీ.. భూటాన్ పర్యటనలో విరుష్క జంట..

దీనిపై యూవీ మాట్లాడారు. భారత్ బయట ఏం జరుగుతుందో కూడా మనం చూడాల్సిన అసవరం ఉందని ఆయన అన్నారు. మాక్స్ వెల్ కి మానసిక పరిస్థితి సరిగా లేదని బ్రేక్ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ మన ప్లేయర్లు మాత్రం అలా చేయడం లేదన్నారు. ఎక్కడ తమ స్థానాన్ని కోల్పోతామోనని వారు భయపడుతున్నారని చెప్పారు. కచ్చితంగా ప్లేయర్స్ అసోసియేషన్ ఉండాలని సూచించారు. 

click me!