టాస్ దెబ్బ తీసింది, బ్యాటింగ్ లో ఫెయిల్: ఓటమిపై విరాట్ కోహ్లీ

By telugu teamFirst Published Feb 24, 2020, 8:35 AM IST
Highlights

న్యూజిలాండ్ పై తొలి టెస్టు మ్యాచులో ఓడిపోవడానికి గల కారణాలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించాడు. టాస్ ఓడిపోవడంతో పెద్ద తేడా పడిందని ఆయన చెప్పాడు. బ్యాటింగ్ లో ఫెయిలయ్యామని కోహ్లీ చెప్పాడు.

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పై జరిగిన తొలి టెస్టు మ్యాచులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. టాస్ ఓడిపోవడమే అత్యంత కీలకంగా మారిందని ఆయన చెప్పాడు. భారత బ్యాటింగ్ యూనిట్ కూడా పోటీ ఇవ్వలేకపోయిందని అన్నాడు. 

టాస్ ఓడిపోవడంతో పాటు బ్యాటింగ్ లో పోటీ పడలేకపోవడం ఓటమికి ప్రధాన కారణమని ఆయన అన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లపై ఒత్తిడి పెట్టడంలో తాము విఫలమయ్యామని చె్పాడు. 220 - 230 పరుగులకే పరిమితం చేసి ఉంటే తాము మరో విధంగా జవాబు చెప్పి ఉండేవాళ్లమని అన్నాడు. 

Also Read: బౌల్ట్, సౌథీ దెబ్బకు విలవిల: న్యూజిలాండ్ పై టీమిండియా ఘోర పరాజయం

కేన్ విలియమ్సన్ మంచి స్కోరు సాధించిన తర్వాత న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సులో 225 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మూడు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్న స్థితిలో న్యూజిలాండ్ 123 పరుగులు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్సులో న్యూజిలాండ్ కు భారత్ తొలి ఇన్నింగ్సుపై 183 పరుగుల ఆధిక్యత లభించింది. 

న్యూజిలాండ్ టెయిల్ ఎండర్స్ ను అవుట్ చేయడంలో విఫలం కావడంతో భారత్ పోటీ ఇవ్వలేని స్థితికి చేరుకుందని అన్నాడు. తొలి ఇన్నింగ్సు తమను వెనక్కి నెట్టిందని ఆయన అన్నారు. బౌలింగ్ యూనిట్ పోటీ ఇవ్వగలిగిందని చెప్పాడు. 7 వికెట్లు పడగొట్టే వరకు సమర్థవంతమైన పాత్ర పోషించిందని, ఆ తర్వాత 3 వికెట్లను త్వరగా పడగొట్టడంలో విఫలం కావడంతో తాము పోటీ ఇవ్వలేని స్థితికి చేరుకున్నైామని అన్నాడు.

విదేశీ గడ్డపై పృథ్వీ షా రెండు మ్యాచులు మాత్రమే ఆడాడని, అతను నేచురల్ స్ట్రోక్ మేకర్ అని, పరుగులు వస్తుంటే బాగా ఆడుతాడని చెప్పాడు. రెండు ఇన్నింగ్సుల్లోనూ మయాంక్ అగర్వాల్ అద్భుతంగా ఆడాడని చెప్పాడు. మయాంక్, అజింక్యా రహానే మాత్రమే టెంపో సాధించారని చెప్పాడు. 

న్యూజిలాండ్, భారత్ రెండో టెస్టు మ్యాచులో క్రిస్ట్ చర్చిలో శనివారం నుంచి తలపడనున్నాయి.

click me!