కోహ్లీలో నాకు నచ్చింది అదే: సచిన్ తో విభేదించిన స్టీవ్ వా

By telugu teamFirst Published Feb 17, 2020, 1:38 PM IST
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సవాళ్లను స్వీకరించే పద్ధతి తనకు నచ్చిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా అన్నాడు. లబూషేన్ పై సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యతో స్టీవ్ వా విభేదించాడు.

సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సవాళ్లను స్వీకరించే పద్ధతి తనకు నచ్చిందని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 1999 ప్రపంచ కప్ జట్టు కెప్టెన్ స్టీవ్ అన్నాడు. లారియస్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ఆదివారంనాడు పాల్గొన్నారు. పీటీఐతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ఏడాది చివరలో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్న విషయం తెలిసిందే. 

ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా ఫేవరైట్ గా ఉంటుందని స్టీవ్ వా అన్నాడు. గత పర్యటనలో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే భారత జట్టు ఓడించి టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుందని, అది భారత జట్టుకు గొప్ప విషయమే అయినా అప్పుడు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు లేరని ఆయన అన్నారు. 

ఇప్పుడు వారి చేరికతో జట్టు బలంగా తయారైందని ఆయన అన్నాడు. ఆసీస్ బౌలింగ్ అటాక్ కూడా మెరుగుపడిందని ఆయన చెప్పాడు. మరోవైపు మార్నస్ లబుషేన్ లాంటి మేటి ఆటగాడు జట్టులోకి వచ్చాడని వా అన్నాడు.

పిచ్ లు, డై అండ్ నైట్ మ్యాచులు ఆస్ట్రేలియా జట్టుకు అనుకూలమని అ్ననాడు. అక్కడి పరిస్థితులపై టీమిండియాకు పెద్దగా అవగాహన లేదని ఆయన అన్నాడు. అయితే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సవాళ్లను స్వీకరించే పద్ధితి తనకు నచ్చుతుందని ఆయన చెప్పాడు. 

ప్రపంచంలో మేటి జట్టుగా కొనసాగాలంటే విదేశాల్లో వీలైనన్ని విజయాలు సాధించాలని ఆయన అన్నాడు. ప్రస్తుతం టీమిండియా కూడా పటిష్టంగా ఉందని, దానివల్ల ఈ సిరీస్ చాలా గొప్పగా సాగే అవకాశం ఉందని ఆయన అన్నాడు. 

లబూ షేన్ తనను గుర్తుకు తెస్తున్నాడని చెప్పిన సచిన్ టెండూల్కర్ మాటలతో వా విభేదించాడు. అయితే, అతన్ని వా ప్రశంసలతో ముంచెత్తాడు. తన అభిప్రాయంలో లబూ షేన్ పరుగుల దాహంతో ఉన్నాడని, 12 నెలల క్రితం జట్టులోకి వచ్చినప్పుడు ఐసిసి ర్యాంకింగ్స్ లో 25వ స్థానంలో ఉన్నాడని, ఇప్పుడు నాలుగో స్థానంలోకి ఎగబాకాడని, అంత అద్భుతమైన మార్పు అతనిలో వచ్చిందని వా అన్నాడు. 

click me!