టీ20 ప్రపంచకప్... భారత్, పాక్ మ్యాచ్ రద్దు.. నిరాశలో అభిమానులు

By telugu news teamFirst Published Feb 17, 2020, 10:15 AM IST
Highlights

భారీ వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌ చూడటానికి వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. భారత్‌ తన తదుపరి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను ఈనెల 18న వెస్టిండీస్‌తో ఆడుతుంది.
 
మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరగాల్సిన భారత్-పాక్ ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయ్యింది.  ఆస్ట్రేలియాలోని అలెన్ బోర్డర్ మైదానంలో ఆదివారం ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా... వర్షం కారణంగా రద్దు అయ్యింది. ఆట మొదలుకావడానికి ముందే రద్దు కావడం గమనార్హం.

Also Read ఫోటోతో భయపెడుతున్న కోహ్లీ.. బెస్ట్ మీమ్ మెటీరియలంటూ నెటిజన్ల ట్రోల్స్...

భారీ వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌ చూడటానికి వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. భారత్‌ తన తదుపరి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను ఈనెల 18న వెస్టిండీస్‌తో ఆడుతుంది.

 భారత్‌–పాక్‌ మ్యాచ్‌తో పాటు ఆస్ట్రేలియా–వెస్టిండీస్, బంగ్లాదేశ్‌–థాయ్‌లాండ్‌ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా జరగలేదు. అడిలైడ్‌ వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఈనెల 21న భారత్, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌తో పొట్టి ప్రపంచ కప్‌కు తెరలేవనుంది.

click me!