కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. 54 మంది కరోనాతో మరణించారు.
భారత్ లో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. రోజు రోజుకు ఈ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 16,047 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే కోవిడ్ వల్ల 54 మంది మరణించారు. తాజా గణాంకాలతో దేశంలో మొత్తం కోవిడ్ కేసులు 4,41,90,697, మరణాలు 5,26,826 గా రికార్డు అయ్యాయి.
ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో యాక్టివ్ కేసులు 24 గంటల వ్యవధిలో 3,546 తగ్గి మొత్తంగా 1,28,261కి చేరుకున్నాయి. COVID-19 రికవరీ రేటు 98.52 శాతంగా, కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా నమోదైందని, వారానికోసారి పాజిటివిటీ రేటు 4.90 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
undefined
‘జెండా కొనకుంటే రేషన్ సరుకులు ఇవ్వం’ వీడియోపై బీజేపీ ఎంపీ ఫైర్.. సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యలు
మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. రికవరీల సంఖ్య 4,35,35,610గా ఉంది. దేశ వ్యాప్తంగా డ్రైవ్ కింద ఇప్పటి వరకు 207.03 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించారు. 48 కొత్త మరణాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్‌ల నుంచి ఏడుగురు, పశ్చిమ బెంగాల్ నుంచి ఐదుగురు, హిమాచల్‌ప్రదేశ్, మిజోరాం నుంచి ముగ్గురు, చత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు చొప్పున, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, నాగాలాండ్ నుంచి ఒక్కొరు చొప్పున ఉన్నారు.
భీమా కోరేగావ్ కేసులో వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మొదటి నుంచి జూలై 19 వరకు భారతదేశంలో 45,000 కంటే ఎక్కువ కోవిడ్ మరణాలు నమోదు అయ్యాయని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో వెల్లడించింది. ఇందులో 22 000 కంటే ఎక్కువ కేసులు కేరళ నుంచే ఉన్నాయని చెప్పింది. తరువాత మహారాష్ట్ర, అస్సాం, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయని పేర్కొంది. కేరళలో ఈ ఏడాది మొత్తంగా 14 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 13 లక్షల కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో దాదాపు 10 లక్షల కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో జూలై 19 వరకు దాదాపు 8 లక్షల కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఈ సంవత్సరం జనవరి నుండి 45,704 మంది కోవిడ్ కారణంగా మరణించారు. ఒక్క కేరళలోనే 22,843 మంది చనిపోయారు. ఈ సంఖ్య 2021 లో 44,399 ఉండగా.. 2020లో 3,042 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 240 మరణాలు నమోదు కాగా, తెలంగాణలో ఈ ఏడాది కోవిడ్ కారణంగా 86 మరణాలు నమోదయ్యాయి. అండమాన్, నికోబార్ దీవులు, దాదర్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ లో మాత్రమే ఈ ఏడాది కోవిడ్ వల్ల ఒక్క మరణం కూడా సంభవించలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. కరోనా వల్ల లక్షద్వీప్‌లో ఒకరు మరణించగా.. లడఖ్‌లో తొమ్మిది మరణాలు నమోదయ్యాయి.
బీహార్ రాజకీయాలు.. నితీష్ కుమార్ పొలిటికల్ ఎత్తుగడపై రాజకీయ నేతలు ఏమన్నారంటే...?
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలకు లేఖలు రాసింది. రాష్ట్రంలో తగినంతగా పరీక్షలు నిర్వహించాలని, కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా ప్రజలు ప్రోత్సహించాలని ఆదేశించింది. రాబోయే రోజుల్లో వివిధ ఉత్సవాల కారణంగా సామూహిక సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి అలర్ట్ గా ఉండాలని పేర్కొంది.