భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 19 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనాతో 49 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత కొంత కాలం వరకు తగ్గుముఖం పట్టి కేసులు ఇప్పుడు మళ్లీ యథావిధిగా అధికం అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 19,406 కొత్తగా కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు నమోదు అయ్యాయి. దీంతో భారత్ లో కేసుల సంఖ్య 4,41,26,994కి పెరిగింది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 1,34,793కి తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
అర్పిత ప్రాణాలకు ముప్పు ఉంది.. జైల్లో ఆహారం, నీరు తనిఖీ చేయండి - ఈడీ తరుఫు న్యాయవాది
undefined
నేటి ఉదయం (శనివారం) 8 గంటల వరకు అప్ డేట్ చేసిన డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 49 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,26,649కి చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.31 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.50 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Covid-19: కరోనా దెబ్బతో తగ్గుతున్న మెదడు జీవితకాలం.. తాజా అధ్యయనం వెల్లడి
యాక్టివ్ కోవిడ్-19 కాసేలోడ్‌లో 24 గంటల వ్యవధిలో 571 కేసుల తగ్గుదల నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా నమోదైందని, వారంవారీ సానుకూలత రేటు 4.63 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రికవరీల సంఖ్య 4,34,65,552కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో కోవిడ్‌కు వ్యతిరేకంగా 205.92 కోట్ల డోసులు అందించారు.
భారతదేశలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 2020 ఆగస్టు 7వ తేదీ నాటికి 20 లక్షలు, ఆగస్టు 23వ తేదీ నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5వ తేదీ నాటికి 40 లక్షలు, సెప్టెంబర్ 16వ తేదీ నాటికి 50 లక్షలు దాటింది. సెప్టెంబర్ 28వ తేదీ నాటికి 60 లక్షలు, అక్టోబర్ 11వ తేదీ నాటికి 70 లక్షలు, అక్టోబర్ 29వ తేదీ నాటికి 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది.
Monkeypox: "నానాటికీ కేసులు పెరగవచ్చు..మరిన్ని మరణాలు సంభవించవచ్చు": WHO
గతేడాది మే 4వ తేదీన కోవిడ్ -19 కేసులు రెండు కోట్లుగా నమోదు అయ్యాయి. అలాగే జూన్ 23వ తేదీన మూడు కోట్లు కేసులుగా రికార్డులకు ఎక్కింది. కాగా ఈ ఏడాది జనవరి 25వ తేదీన మొత్తం నాలుగు కోట్ల కేసుల మైలురాయిని భారత్ దాటింది.