ఢిల్లీ, ముంబాయి పట్టణాల్లో జనవరి చివరి నుంచి ఫిబ్రవరి మధ్యలో కరోనా కేసులు పీక్ స్టేజ్ కు చేరతాయని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త అగర్వాల్ తెలపారు. అయితే హాస్పిటల్ లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటుందని అంచనా వేశారు.
దేశంలో కరోనా (corona) కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన వారం రోజుల కిందట పది వేల లోపే కోవిడ్ -19 (covid -19) కేసులు నమోదయ్యేవి. కానీ రెండు రోజుల నుంచి కేసుల సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. దాదాపు లక్షకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలా ఆందోళనకరం. గడిచిన రెండు వేవ్ లు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఆర్థికంగా చాలా దెబ్బతింది. ఎందరో మంది నిరుద్యోగులయ్యారు. మరెందరో మంది తమ ఆత్మీయులను కోల్పొయారు. ఇప్పుడిప్పుడే అన్ని వ్యవస్థలు గాడిలో పడుతున్నాయనుకున్న సమయంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం కలకలం రేపుతోంది.
చాలా రాష్ట్రాల్లో కోవిడ్ -19 (covid -19) కేసుల్లో పెరుగుద కనిపిస్తోంది. ప్రతీ రోజుల వేల్లలో కేసులు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే దేశంలో ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ విషయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ (nithish kumar yadav) వారం రోజుల కిందట ఒక ప్రకటన చేశారు. తమ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ (third wave) మొదలయ్యిందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ థర్డ్ వేవ్ ను ఎదుర్కొవడానికి బీహార్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మిగితా రాష్ట్రాలు ఇలా అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ కేసుల పెరుగుదలను చూస్తే థర్డ్ వేవ్ ప్రారంభమైందని అర్థమవుతోంది.
undefined
దేశంలో ఢిల్లీ (delhi), ముంబాయి (mumbai) పట్టణాల్లో అత్యధికంగా కోవిడ్ -19 కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఆ పట్టణాల్లో జనవరి చివరి నుంచి ఫిబ్రవరి మధ్యలో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు వెళ్తుందని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ అంచనా వేశారు. ఆ సమయంలో దేశంలో ఒకే రోజు నాలుగు నుంచి ఎనిమిది లక్షల కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇది రెండో వేవ్ లో పీక్ స్టేజ్‌లో నమోదైన కేసుల కంటే దాదాపు రెండు రేట్లు ఎక్కువ అని ఆయన తెలిపారు. ముంబయి, ఢిల్లీ వంటి పెద్ద నగరాలు చాలా ముందుగానే బహుశా ఈ నెల మధ్యలోనే పీక్ స్టేజ్ కు వెళ్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
దేశంలో కరోనా (corona) కేసుల పెరుగుదల అంచనా వేసేందుకు ఐఐటీ కాన్పూర్ ముగ్గురు నిపుణుల బృందాన్ని నియమించింది. ఇందులో సైంటిస్ట్ అగర్వాల్ (agarwal) ఒకరుగా ఉన్నారు. జనవరి మధ్య నాటికి ముంబాయిలో 30 వేల నుంచి 60 వేల కోవడ్ -19 కేసులు నమోదవుతాయని చెప్పారు ఇవి చాలా ఎక్కువ కేసులని అన్నారు. అయితే ఇందులో హాస్పిటల్ లో చేరే వారి సంఖ్య కేవలం 3.5 శాతం మాత్రమే ఉంటుందని తెలిపారు. కాబట్టి హాస్పిటల్ లో బెడ్ అవసరం ఉన్న వారు 10 వేల వరకు మాత్రమే ఉంటారని అంచనా వేశామని తెలిపారు. ఢిల్లీలో గరిష్టంగా రోజుకు 35 నుంచి 70 వేల కేసుల నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ఆ పట్టణంలో కూడా హాస్పిటల్ లో చేరు వారు 12 వేల కంటే తక్కువగానే ఉంటారని తెలిపారు.కొత్త ఒమిక్రాన్ వేరియంట్ అధిక ట్రాన్స్‌మిసిబిలిటీని చూపించిందని, అయితే దాని తీవ్రత డెల్టా వేరియంట్‌లో కనిపించేంతగా లేదని ఆయన తెలిపారు.